Moviesఎఫ్ 3 సినిమా చూసిన బాల‌య్య‌... మామూలు ఎంజాయ్ కాదుగా...!

ఎఫ్ 3 సినిమా చూసిన బాల‌య్య‌… మామూలు ఎంజాయ్ కాదుగా…!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర ఎఫ్ 3. ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమా ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఎఫ్ 3 ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఐదు రోజుల‌కే ఏపీ, తెలంగాణ‌లో రు. 32 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా అటు ఓవ‌ర్సీస్‌లోనూ 1.1 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేసింది.

ఓవ‌రాల్‌గా అనిల్ రావిపూడి కెరీర్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిల‌వ‌డంతో పాటు అనిల్ టాలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్ల లీగ్‌లో చేర్చేసింది. ఆరేళ్లలో ఆరు వ‌రుస హిట్ల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టి.. ఇక్క‌డ రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం అన్న‌దే లేని ద‌ర్శ‌కుడిగా అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. ఎఫ్ 3 స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న అనిల్ త‌న నెక్ట్స్ సినిమాను నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం బాల‌య్య మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్‌లో త‌న 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది. ఇక ఎఫ్ 3 ప్ర‌మోష‌న్ల‌లో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడు. త‌న నెక్ట్స్ సినిమా డైరెక్ట‌ర్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ఈ సినిమాను చూశాడు. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో క‌లిసి సినిమా చూసిన బాల‌య్య ఆద్యంతం సినిమాను పిచ్చ పిచ్చ‌గా ఎంజాయ్ చేశాడ‌ట‌.

సినిమా చూసిన అనంత‌రం ద‌ర్శ‌కుడు అనిల్‌తో క‌లిసి ఫొటో దిగాడు. అనిల్ రావిపూడిని మాత్ర‌మే కాకుండా టోట‌ల్‌గా ఎఫ్ 3 చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఇక బాల‌య్య ఈ సినిమా చూసి యూనిట్‌ను అభినందించ‌డం.. ఎఫ్ 3కు పెద్ద బూస్ట‌ప్ లాంటిదే అని చెప్పాలి. ఇక త‌న సినిమాలో బాల‌య్య రోల్ ఎలా ఉంటుందో ? కూడా అనిల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. 50 ఏళ్లు పై బ‌డిన ఓ న‌డివ‌య‌స్సు ఉన్న వ్య‌క్తి పాత్ర‌లో బాల‌య్య క‌నిపించ‌బోతున్నాడ‌ని.. అస‌లు సినిమా చూశాక బాల‌య్య‌ను ఇలాంటి రోల్లో ఎప్పుడూ చూడ‌లేద‌ని ప్ర‌తి ఒక్క‌రు మెస్మ‌రైజ్ అవుతార‌ని కూడా చెప్పాడు.

ఈ సినిమాలో బాల‌య్య‌కు కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల న‌టిస్తుంద‌ని కూడా అనిల్ చెప్పాడు. ఇక బాలయ్య‌కు జోడీగా జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు గ్ర‌హీత ప్రియ‌మ‌ణిని దాదాపు ఎంపిక చేశార‌ని అంటున్నారు. ఆమె గ‌తంలో బాల‌య్య ప‌క్క‌న మిత్రుడు సినిమాలో న‌టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news