MoviesDonate a Meal: అరుదైన రికార్డ్..ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు హ్యాట్సాఫ్..!!

Donate a Meal: అరుదైన రికార్డ్..ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు హ్యాట్సాఫ్..!!

సినీ ఇండస్ట్రీలో ఆల్ మోస్ట్ అందరి హీరోలకి అభిమానులు ఉంటారు . తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు పూలమాలలు వేసి..పాలాభిషేకలు చేసి..అరుస్తూ నానా హంగామా చేస్తుంటారు. ఇలాంటివి మనం చూశాం. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..రూటే వేరు. తమ అభిమాన హీరో కోసం ఆయన పేరు చెప్పి పలు సేవా కార్య క్రమాలు చేస్తుంటారు. ఈ క్రమంలో నే Donate a Meal అంటూ ఆకలితో ఉన్న పేద వాళ్లకి అన్నం పెట్టడం స్టార్ట్ చేసారు. ఇప్ప‌టికే టీం తార‌క్ పేరిట అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న ఫ్యాన్స్..ఈసారి కొత్తగా ఆలోచించి ఓ ట్ర‌స్టు ఏర్పాటుచేసి Donate a Meal అంటూ భోజనాలు పెట్టడం ప్రారంభించింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మొదలు పెట్టిన ఈ సేవా కార్యక్రమం ఇప్పుడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.అలా రెండు సంవత్సరాల క్రితం సాధారణంగా మొదలైన ఈ డొనేట్ ఏ మీల్…ఇప్పుడు 600వ రోజులు కంప్లీట్ చేసుకునే టైంకి దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు..133 లొకేష‌న్లు ఉన్నాయి. 600 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పోస్టర్లు విడుదల చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్లును విడుదల చేశారు తారక్ అభిమానులు. మొత్తంగా ఐదు రాష్ట్రాల‌లో అన్నార్తుల‌కు అన్నం పెట్టే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం దిద్ది ఆద‌ర్శంగా నిలిచారు తారక్ అభిమానులు.

జనరల్ గా ఫ్యాన్స్ అంటే అరుపులు కేకలు…గోలలు అనుకునే వాళ్లకి తారక్ ఫ్యాన్స్ చేప్పటిన ఈ పనులు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ తలచుకుంటే ఏమైన చేయగలం అని మరోసారి ప్రూవ్ చేసారు నందమూరి ఫ్యాన్స్. ఫుట్‌పాత్‌ల మీద జీవిస్తూ.. అన్నం కోసం ఎదురు చూసే వాళ్ల కోసం టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. తార‌క్ ను ఎంతగానో అభిమానించే యువ‌త ఈ సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి ప‌లువురి ప్ర‌శంస‌లు అందుకున్నారు. మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రా, తెలంగాణ‌లోనే కాకుండా పొరుగున ఉన్న బెంగ‌ళూరు, చెన్నై లాంటి మ‌హా న‌గ‌రాల్లోనూ తార‌క్ ఫ్యాన్స్ అంతా క‌లిసి ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఆకలి తో ఉన్న వాళ్లకి అన్న పెట్టి ఆదుకోవ‌డంలో ఉన్న తృప్తిని మించి మ‌రొక‌టి లేనేలేద‌ని తారక్ ఫ్యాన్స్ చెబ్బుతున్నాతు. దీంతో అందరు తారక్ అభిమానులకు హ్యాట్సాఫ్ చెప్పుతున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తారక్ అభిమానులు ఇంకా మరెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మనం కూడా తారక్ ఫ్యాన్స్ కి హ్యాట్సాఫ్ చెప్పుదాం..”Hatsoff to NTR Fans”..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news