Moviesఆ పార్టీ గెలుస్తుంద‌ని తార‌క్‌ ముందే చెప్పారు..సముద్రఖని సెన్సేషనల్ కామెంట్స్..!!

ఆ పార్టీ గెలుస్తుంద‌ని తార‌క్‌ ముందే చెప్పారు..సముద్రఖని సెన్సేషనల్ కామెంట్స్..!!

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో హీరోలు ఎంత ఫేమస్ అవుతున్నారో..అలాగే వాళ్లను ఢీ కొట్టే పాత్రల్లో నటించే విలన్ లు కూడా అంతే పాపులర్ అవుతున్నారు. తొడ కొట్టడాలు..మీసాలు మెలివేయడాలు పోయాయి..నేటి విలన్స్ అంతా రిచ్ లుక్ లోనే రఫాడిస్తారు. సినిమాలో హీరోలకు తగ్గ రేంజ్ లోనే కధలో వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ విలన్ లకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ క్రేజ్ ని బట్టే డైరెక్టర్లు వాళ్ళని సినిమాలోకి తీసుకుంటారు. అలా అటు తమిళం లోను..ఇటు తెలుగులోను రెండింటిలోను టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు సముద్రఖని.

 

సముద్రఖని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ విలన్. అలవైకుంఠపురంలో, క్రాక్, భీమ్లానాయక్ లాంటి సినిమాలతో అదరగొట్టారు సముద్ర ఖని. ఆయన కేవలం నటుడే కాదు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కూడా. విలక్షణ నటనతో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు నటుడు సముద్రఖని. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఎంపీ రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రఖని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యుల్లో సముద్రఖని మాట్లాడుతూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఆయన మాట్లాడుతూ..”తారక్ లో సూపర్ టాలెంట్ ఉంది. చాలా చురుకైన వాడు. సినిమా లో ఎంత బాగా నటిస్తాడో..అంతకన్నా ఎక్కువగానే రాజకీయల పై పట్టు ఉంది. తారక్ కి రాజకీయ నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఎప్పుడైన కలిసినప్పుడు ఎన్టీఆర్ నేను ఎన్నో విష‌యాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఓ సంధర్భంలో ఎన్టీఆర్‌ రాజ‌కీయాల‌పై మాట్లాడిన మాటలు చూసి ఆశ్చర్యంగా అనిపించింది. తారక్ కి ఇంత రాజకీయ నాలెడ్జ్ ఉందా అనిపించింది. ఎన్నిక‌ల‌కు ముందె త‌మిళ‌నాడులో డీఎంకే పార్టీ గెలుస్తుంద‌ని తారక్ ఎప్పుడో చెప్పారు..లాస్ట్ కి అదే జ‌రిగింది.

రిజల్ట్ తరువాత మళ్ళి మేము కలిస్తే నేను చెప్పిందే జరిగింది చూశావా అంటూ చెప్పాడు. ఎన్టీఆర్ తో మాట్లాడుతుంటే ఆ వైడ్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సొసైటీ రాజకీయాలపై ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. తారక్ టూ టాలెంటెడ్ అటు సినిమాలోను ఇటు రాజకీయాలోను” అంటూ సముద్రఖని స్పష్టం చేశారు. దీంతో తార‌క్‌ పోలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజకీయల పై ఇంత పట్టు ఉన్న ఎన్టీఆర్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే..టీడీపీ మళ్ళీ బలపడుతుంది అంటూ ఆశపడుతున్నారు. మరి చూడాలి తారక్ ఏం చేస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news