Moviesస‌మంతను వాళ్లు ఘోరంగా అవ‌మానించారా... ఆ కోపంతోనే ఇలా చేసిందా...!

స‌మంతను వాళ్లు ఘోరంగా అవ‌మానించారా… ఆ కోపంతోనే ఇలా చేసిందా…!

స్టార్ హీరోయిన్ స‌మంత నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చాక మామూలు జోరులో లేదు. వ‌రుస పెట్టి సినిమాలు ఓకే చేసుకుంటూ వెళుతోంది. ఈ క్ర‌మంలోనే తెలుగుతో పాటు త‌మిళం, అటు బాలీవుడ్‌.. చివ‌ర‌కు హాలీవుడ్ సినిమాలు చేసేందుకు కూడా ఓకే చెప్పేసింది. ఈ క్ర‌మంలోనే కాస్త బోల్డ్ పాత్ర‌ల్లో న‌టించేందుకు కూడా ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తూ వ‌స్తోంది.

చైతుతో విడాకుల త‌ర్వాతే ఆమె బ‌న్నీ ప‌క్క‌న పుష్ప సినిమాలో ఊ అంటావా మావా ఐటెం సాంగ్ చేసింది. అస‌లు ఈ ఐటెం సాంగ్‌లో స‌మంత క‌నిపించిన హాట్‌నెస్‌కే మ‌న తెలుగు జ‌నాలు ముక్కున వేలేసుకున్నారు. పాత్ర ప్ర‌యార్టీతో పాటు డిమండ్ చేస్తే ఆమె హ‌ద్దులు దాటే విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌ని పుష్ప ఐటెం సాంగ్‌తోనే చెప్ప‌క‌నే చెప్పేసింది.

ఈ పాట‌లో స‌మంత చూపించిన అందాలే ఆమెను బాలీవుడ్‌లోనూ మ‌రింత పాపుల‌ర్ అయ్యేలా చేసింది. అందుకే ఆమెకు బాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్లు త‌లుపు త‌ట్టాయి. అంత‌కు ముందే ఆమె అక్క‌డ తెలుగు ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్ ఎన్ డీకే తో `ఫ్యామిలీ మ్యాన్ 2`లో నటించింది. ఈ వెబ్‌సీరిస్‌లో ఆమె చాలా బోల్డ్‌గా క‌నినిపించ‌ద‌న్న చ‌ర్చలు కూడ న‌డిచాయి. ఇవి కూడా అక్కినేని ఫ్యామిలీ హ‌ర్ట్ అయ్యేందుకు కార‌ణ‌మ‌య్యాయ‌న్న ప్ర‌చారం కూడా న‌డ‌చింది.

పుష్ప బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. అక్క‌డే ఈ సినిమాకు రు. 100 కోట్లు వ‌చ్చాయి. ఇప్పుడు ఆమెకు వ‌రుస‌గా బాలీవుడ్ ఆఫ‌ర్లు వ‌స్తున్నా ఎందుకు ఒప్పుకోవ‌డం లేదు..ఒక‌టి రెండు వెబ్‌సీరిస్‌ల‌కు మాత్ర‌మే ఓకే చెప్పిందా ? అంటే బాలీవుడ్ వాళ్లు స‌మంత‌ను స‌రిగా గుర్తించ‌క‌పోవ‌డ‌మే అంటున్నారు. అక్క‌డ ఆమెకు రెండో హీరోయిన్ పాత్ర‌ల‌తో పాటు ప్రాధాన్యం లేని పాత్ర‌లు ఇవ్వ‌డంతో ఆమె తీవ్రంగా డిజ‌ప్పాయింట్ అయిన‌ట్టు టాక్ ?

ఇక్క‌డ తిరుగులేని క్రేజ్ ఉన్న‌ప్పుడు బాలీవుడ్‌కు వెళ్లి సెకండ్ హీరోయిన్ ముద్ర వేయించుకోవ‌డం ఆమెకు ఇష్టం లేద‌ట‌. అందుకే ఆమె బాలీవుడ్ అంటూ పట్టుకుని వేలాడ‌కూడ‌ద‌నే వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషీ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news