Moviesచిరంజీవి మిస్ చేసుకున్న బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. వెంక‌టేష్ సూప‌ర్ హిట్ కొట్టేశాడు..!

చిరంజీవి మిస్ చేసుకున్న బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. వెంక‌టేష్ సూప‌ర్ హిట్ కొట్టేశాడు..!

సినిమా రంగంలో ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమాను.. మరొక హీరో చేసి సూపర్ హిట్ కొడుతూ ఉంటారు. ఒక కథ ఒక హీరోకు నచ్చక రిజెక్ట్ చేస్తుంటారు. అదే కథను మరో హీరో సినిమాగా చేసి సూపర్ హిట్ కొడుతూ ఉంటారు. ఇక్కడ కథను జడ్జ్‌ చేయడంతో పాటు కూసింత అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే హిట్ సినిమాలు పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన ఒక సినిమాను విక్టరీ వెంకటేష్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అలా ఒక హిట్ సినిమా చిరంజీవి నుంచి చేజారింది. మరి ఆ సినిమా ఏంటి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అణ్ణామ‌లై సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. తెలుగులో కృష్ణంరాజు నటించిన ప్రాణ స్నేహితులు సినిమా కాస్త అటూ ఇటుగా మార్చి తమిళంలో తెరకెక్కిస్తే అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం నిర్మాతలు పోటీ పడ్డారు. చివరకు నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ ఎక్కువ రేటు కోట్ చేసి ఆ సినిమా రీమేక్ హక్కులు పొందారు.

మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న ఈ సినిమాను చిరంజీవితో రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన అనుకున్నారు. విచిత్రమేంటంటే ఆయన ఫ్లైట్లో వస్తుంటే… అదే ఫ్లైట్లో చిరంజీవి కూడా ఉన్నారు. దీంతో సత్యనారాయణ ఆ సినిమా కథ గురించి చిరంజీవికి చెప్పగా… తాను ఆ సినిమాలో నటిస్తానని ఓకే చెప్పేశారు. చిరంజీవి ఓకే చెప్పిన ఆనందంతో నిర్మాత సత్యనారాయణ సుందరకాండ షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కి వెళ్లారు.

అయితే అప్పటికే అణ్ణామ‌లై రీమేక్ రైట్స్ ఆయన తీసుకున్నారనే విషయం వెంకటేష్ కు తెలిసింది. వెంటనే వెంకటేష్ ఆ సినిమా కూడా మనమే చేద్దాం అని చెప్పడంతో కెవివి షాక్ అయ్యారు. ఆయ‌న అప్పటికే వెంకటేష్ తో సుందరకాండ సినిమా చేస్తున్నారు. వెంకీ త‌న నెక్ట్స్ సినిమా కూడా అదే బ్యానర్ లో చేసేందుకు ఓకే చెప్పారు. వెంకటేష్ వ‌రుస‌గా రెండో అవకాశం ఇచ్చినందుకు ఆనందపడాలో… లేదా ఆ సినిమా చిరంజీవితో అవుతున్నందుకు బాధపడాలో తెలియక కె.వి.వి కాస్త డైలమాలో పడ్డారు.

అయితే అప్పటికే వెంకటేష్‌తో ఒక సినిమా చేస్తుండడంతో… ఆయనతోనే ఆ తర్వాత సినిమా కూడా చేయక తప్పని పరిస్థితి. ఆ సినిమా కొండపల్లి రాజాగా తెలుగులో రీమేక్ అయ్యి ఇక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. సుమ‌న్‌ మరో హీరోగా నటించిన ఈ సినిమాలో నగ్మా హీరోయిన్ గా నటించింది. రవి రాజా పినిశెట్టి ఈ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంతకుముందు వెంకటేష్ – ర‌విరాజా కాంబినేషన్ లో వచ్చిన చంటి సినిమా సూపర్ హిట్ అవడంతో కొండపల్లి రాజా సినిమాకు కూడా రవిరాజా పినిశెట్టిని దర్శకుడుగా తీసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news