Moviesమోక్ష‌జ్ఞ‌కు అప్పుడే రెండు టాప్ బ్యాన‌ర్ల నుంచి అడ్వాన్స్‌లు..!

మోక్ష‌జ్ఞ‌కు అప్పుడే రెండు టాప్ బ్యాన‌ర్ల నుంచి అడ్వాన్స్‌లు..!

టాలీవుడ్ లో ఇప్పుడు వారసుల రాజ్యం నడుస్తోంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా వారసులుగా వచ్చి వరుస సక్సెస్‌లతో దూసుకు పోతున్నారు ఈ క్రమంలోనే సీనియర్ హీరోలు చిరంజీవి – నాగార్జున వార‌సులు ఇప్పటికే హీరోలుగా వచ్చి నిలదొక్కుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి సీనియర్ హీరో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ మీదే ఉంది. గత నాలుగైదు సంవత్సరాలుగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడన్న ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఆ దిశగా ప్రయత్నాలు ఏమి జరిగినట్టు అనిపించడంలేదు. దీంతో నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా వస్తాడా ? అని ఎదురు చూస్తూనే ఉన్నారు.

బాలయ్య సూపర్ హిట్ సినిమా ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌గా ఆదిత్య 999 సినిమా వస్తుందని… ఆ సినిమాలో మోక్షజ్ఞ హీరోగా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజా అప్డేట్ ప్రకారం బాలయ్య తన వారసుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను బోయపాటి శ్రీనుకు అప్పగించారని… నందమూరి కాంపౌండ్ నుంచి ప్రచారం అయితే బయటకు వచ్చేసింది. బాల‌య్య‌కు ఒకటి కాదు రెండు కాదు మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి… బి.గోపాల్ తర్వాత ఆ స్థాయిలో తనకు క్రేజ్ తెప్పించిన ఘనత బోయపాటి శ్రీనుకు దక్కుతుంది.

ఈ క్రమంలోనే బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తే మోక్షజ్ఞ మాస్ హీరోగా ఎలివేట్ అవుతాడని బాలయ్య నమ్మకంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ కు ఇప్పటికే రెండు టాప్ బ్యానర్ల‌ నుంచి అడ్వాన్సులు కూడా అందినట్టు తెలుస్తోంది. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నాలుగేళ్ల క్రితమే మోక్షజ్ఞకు కొంత అడ్వాన్స్ ఇచ్చారని టాక్. అయితే మోక్షజ్ఞ తొలిసినిమా అదే బ్యానర్ లో ఉంటుందా ? లేదా మైత్రి మూవీస్ వారు కూడా మోక్షజ్ఞ కు అడ్వాన్ ఇవ్వ‌డంతో మైత్రి మూవీస్ బ్యానర్లో మోక్షజ్ఞ తొలి సినిమా ఉంటుందా ? అన్న‌ది చూడాలి.

అలాగే వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ కూడా మోక్షజ్ఞ తో ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అశ్వినీదత్ నందమూరి వంశం లో సీనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్‌ల‌తో ఇప్పటికే సినిమాలు చేశారు. మోక్షజ్ఞ తో కూడా ఒక సినిమా చేయాలని ఆయన కోరిక. ఏదేమైనా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలే కానీ.. వరుస పెట్టి ఆయనతో సినిమాలు చేసేందుకు టాప్ నిర్మాతలు క్యూలో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news