Moviesపాకిస్తాన్ స్టార్ క్రికెట‌ర్‌తో త‌మ‌న్నా ప్రేమాయ‌ణం.. అస‌లు ఏం జ‌రిగింది..?

పాకిస్తాన్ స్టార్ క్రికెట‌ర్‌తో త‌మ‌న్నా ప్రేమాయ‌ణం.. అస‌లు ఏం జ‌రిగింది..?

టాలీవుడ్ లో అందరూ స్టార్ హీరోలు, యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది మిల్కీబ్యూటీ తమన్నా. 15 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా తన అందంతో పాటు… అభినయంతో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ముంబై బ్యూటీ అయిన తమన్నా ఇప్పుడు చిరంజీవి లాంటి సీనియర్ హీరోలకు కూడా బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. మంచు హీరో నటించిన శ్రీ సినిమాతో ఆమె టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది. హ్యాపీడేస్‌ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకునే అవసరం కూడా రాలేదు.

మూడున్నర పదుల వయసులో ఉన్న తమన్నా ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆమె రామ్ చరణ్ – రవితేజ – ఎన్టీఆర్ – మహేష్ బాబు – చిరంజీవి – వెంకటేష్ – నాగ చైతన్య లాంటి స్టార్ హీరోల సరసన జత కట్టి ఒక వెలుగు వెలిగింది. కొద్ది రోజుల క్రితం తమన్నా పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో ప్రేమలో పడిందని… త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఒకటే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అక్కడితో ఆగకుండా అబ్దుల్ రజాక్ – తమన్నా దిగిన ఫోటోలు కూడా కొందరు వైరల్ చేశారు. దీంతో అసలు ఏం జరిగిందో ? ఎవరికీ అర్థం కాలేదు. ఇంత సైలెంట్‌గా ఉన్న తమన్నా ఎప్పుడు ప్రేమలో పడిందా అని ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అయితే తమన్నా గతంలో ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ‌కు చెందిన కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ చేసేందుకు వెళ్లిందట. అయితే అక్కడకు అబ్దుల్ రజాక్ కూడా రావడంతో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి.

దీంతో కొందరు నెటిజన్లు రజాక్‌కు – తమన్నాకు మధ్య లవ్ ఎఫైర్ ఉందని… త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఒకటే ప్రచారం చేశారు. ఆ తర్వాత విషయం ఏంటన్నది ఆరా తీస్తే… ఇది ఓ షాపు ఓపెనింగ్ కు సంబంధించిన ఫోటో అని తేలింది. ఇక తమన్నా ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎఫ్ 3 సినిమాలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పక్కన నటిస్తోంది. అలాగే గుర్తుందా శీతాకాలం సినిమాలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో తమన్నానే హీరోయిన్ గా తీసుకున్నారు. తనకు వయస్సు పెరుగుతున్నా అవకాశాలు ఏ మాత్రం తగ్గటం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news