Moviesమాస్ వీరంగం అంటే ఇదే..పెళ్లి సందD క్లోజింగ్ కలెక్షన్స్..టోటల్ ఎన్ని కోట్లు...

మాస్ వీరంగం అంటే ఇదే..పెళ్లి సందD క్లోజింగ్ కలెక్షన్స్..టోటల్ ఎన్ని కోట్లు రాబట్టిందంటే..!!

టాలీవుడ్ లెజండ్ దర్శకుడు రాఘవేంద్ర రావు ఎన్నో అద్భుతమైన సినిమాలని తెరకెక్కించారు. అందులో వన్ ఆఫ్ ది బ్లాక్‌బస్టర్ మూవీ ‘పెళ్లి సందడి’. ఈ సినిమా సరిగ్గా 25 సంవత్సరాల క్రితం శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో.. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఆ సినిమాలోని పాటలు జనాలను అలరిస్తూనే ఉన్నాయి.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాని ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు.ఇది జగమెరిగిన సత్యం. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ‘పెళ్లి సందడ్’ అంటూ మరో సినిమా వచ్చిన విషయం తెలిసిందే. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో.. గౌరీ రోనంకి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. కొత్త అమ్మాయి శ్రీలీలా హీరోయిన్‌గా నటించారు.అంతేకాకుండా ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం కూడా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

దస‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వ‌చ్చాయి. తొలిరోజే ఈ సినిమాకు ఫ్లాప్‌ టాక్ వ‌చ్చింది. ఈ సినిమా మొదటి ఆటకే టాక్ పరంగా పరమ రొటీన్ మూవీ అంటూ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ మాత్రం అంచనాలను మించిపోయే రేంజ్ లో ఉన్న్నాయి. రీసెంట్ గా పెళ్లి సందడ్ సినిమా క్లోజింగ్ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి.

పెళ్లి సందD సినిమాకు ఏరియా వైజ్‌గా క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి…
నైజాం: 2.08 కోట్లు.
సీడెడ్: 1.55 కోట్లు.
ఉత్తరాంధ్ర: 1.06 కోట్లు.
ఈస్ట్: 0.53 కోట్లు.
వెస్ట్: 0.40 కోట్లు.
గుంటూరు: 0.64 కోట్లు.
కృష్ణా: 0.45 కోట్లు.
నెల్లూరు: 0.35 కోట్లు.

ఏపీ+తెలంగాణ(టోటల్): 7.06 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్: 0.60 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్: 7.66 కోట్లు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news