Moviesక‌త్రినా కైఫ్ పెళ్లి డేట్ వచ్చేసిందోచ్..రాజ‌స్థాన్‌లో ఆ ప్రత్యేకమైన కోటలోనే..?

క‌త్రినా కైఫ్ పెళ్లి డేట్ వచ్చేసిందోచ్..రాజ‌స్థాన్‌లో ఆ ప్రత్యేకమైన కోటలోనే..?

కత్రినా కైఫ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రెండు ద‌శాబ్దాల క్రితం క‌త్రినా కైఫ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు ఎలా ఉందో ఇప్పుడు దాదాపు అంతే సైజ్‌లో ఆమె ఉంది. క‌త్రినా వయసు పెరుగుతున్న అందం ఇప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర్లేదు. ఇంత సుదీర్ఘ‌కాలంగా బాలీవుడ్‌లో కెరీర్ కొనసాగించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. కొత్త కొత్త అందాలు బాలీవుడ్ లో అడుగు పెడుతున్న.. ఈ భామ అందం ముందు వాళ్లు ఫ్లాప్ అవుతున్నారు. ఇక ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ పుల్ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది.

ఇక ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వస్తున్నా, వయసు 41కి చేరువ‌వుతున్నా ఈమె క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. కత్రినా కైఫ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఇప్పటికే బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది. దానికి తగ్గట్టే వీరిద్దరూ ప్రైవేట్‌గా కలుసుకోవడం..అలా కలుసుకున్న ప్రతిసారి మీడియా కంట పడటంతో వీళ్ళు లవ్ బార్డ్స్ అని ఫిస్ అయ్యిపోయారు అందరు. అలా ఈ మధ్యే కత్రినా కైఫ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ సీక్రెట్‌గా జరిగిన రోకా ఈవెంట్‌లో ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ తంతూ ఫినిష్ చేసిన్నట్లు బాలివుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ జంట డిసెంబర్ 9 తేదీరాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారట. అయితే తమ పెళ్లి వార్త ఏ మాత్రం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసు కుంటున్నారట. తన పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ డెస్టినేషన్‌ను కూడా కత్రినా కైఫ్ కన్‌ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ కోటలో వీరి పెళ్లి జరగబోతోందని సమాచారం.

రాజస్థాన్‌లోని రాంథమ్‌బోర్ నేషనల్ పార్క్‌కు 30 నిమిషాల దూరంలో ఈ కోట ఉంది.బాలీవుడ్‌‌తో పాటు టాలీవుడ్‌ సహా రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్టు సమాచారం. అంతేకాదు సల్మాన్‌ ఖాన్ కుటుంబం మొత్తం ఈ పెళ్లికి హాజరుకానున్నట్టు టాక్. ఎమదరితోనో ప్రేమాయణం నడిపైన ఈ భామ ఎట్ట‌కేల‌కు ఇప్పుడు విక్కీ కౌశ‌ల్‌తో క‌లిసి జీవించేలా ఆమె అడుగులేస్తుంద‌ని సినీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news