Moviesమా ర‌గ‌డ‌.. ఆ హీరోయిన్ విష్ణు క్యాంప్ నుంచి జంప్ ?

మా ర‌గ‌డ‌.. ఆ హీరోయిన్ విష్ణు క్యాంప్ నుంచి జంప్ ?

మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో యుద్ధం మామూలుగా లేదు. ఎవ‌రికి వారు ప్రెస్ మీట్ల‌తో మా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని హీటెక్కించేశారు. ఇక ప్ర‌కాష్ రాజ్ ముందు మీడియాకి ఎక్కేశారు. ఛానెల్స్‌లో నాగ‌బాబును కూర్చోపెట్టి గంట‌లు గంట‌లు మాట్లాడేయ‌డంతో ప్ర‌చారం ప్రారంభించారు. అలాగే మెగాస్టార్ అండ‌దండ‌లు ఉన్నాయ‌ని కూడా చెప్ప‌క‌నే చెప్పారు. ఇదిలా ఉంటే గ‌తంలో మా ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన ఓ సీనియ‌ర్ హీరోయిన్‌ను త‌మ క్యాంప్ నుంచి పోటీ చేయించాల‌ని విష్ణు క్యాంప్ అనుకుంద‌ట‌.

తీరా క‌ట్ చేస్తే ఆమె ప్ర‌కాష్ రాజ్ క్యాంప్‌లో ప్ర‌త్య‌క్ష‌మైపోయింద‌ట‌. దీంతో అవాక్క‌వ్వ‌డం విష్ణు క్యాంప్ వంతు అయ్యిందంటున్నారు. ఆ సీనియ‌ర్ హీరోయిన్ మోహ‌న్ బాబుకు అత్యంత స‌న్నిహితురాలు. మీరు ఎందుకు ఆ క్యాంప్ వైపు ఉన్నారు ? అని మోహన్ బాబు స్వయంగా ఆమెకు ఫోన్ చేస్తే త‌న‌కు మెగాస్టారే అటు వెళ్ల‌మ‌ని చెప్పార‌ని ఆమె చెప్పార‌ట‌. మ‌రో హీరోయిన్ సైతం ఇదే సమాధానం చెప్పారని తెలుస్తోంది.

ఇక ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్లో పోటీలో ఉన్న చాలా మందికి చిరంజీవే స్వ‌యంగా ఫోన్లు చేసి పోటీ చేయ‌మ‌ని చెప్ప‌డంతో వాళ్లంతా రంగంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప్యానెల్ నుంచి పోటీలో ఉన్న వారిలో చాలా మంది బాస్ చెప్పారు.. తాము పోటీ చేస్తున్నామ‌ని మీడియాకు, త‌మ స‌న్నిహితుల‌కు చెప్పుకుంటోన్న ప‌రిస్థితి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news