Newsబ్రేకింగ్‌: సిటీ బ‌స్సులో వ‌చ్చి ప్ర‌కాశం బ్యారేజ్‌లోకి దూకిన యువ‌తి

బ్రేకింగ్‌: సిటీ బ‌స్సులో వ‌చ్చి ప్ర‌కాశం బ్యారేజ్‌లోకి దూకిన యువ‌తి

విజ‌య‌వాడ న‌గ‌రంతో పాటు చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో అనేక స‌మ‌స్య‌లు, ఇబ్బందులు, గొడ‌వ‌ల్లో ఉన్న వారు ప్ర‌కాశం బ్యారేజ్‌లోకో లేదా కృష్ణా న‌దిలోకో దూకుతోన్న సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల త‌ర‌చూ జ‌రుగుతున్నాయి. వీరు దూక‌డం ప‌క్క‌నే ఉన్న పోలీసులు రెస్క్యూ ఆప‌రేష‌న్ చేసి వీరిని కాపాడ‌డ‌మో లేదా వీరు చ‌నిపోతుండ‌డమో జ‌రుగుతోంది. తాజాగా ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ యువతి కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అంద‌రూ చూస్తుండ‌గానే ఆ యువ‌తి కాల్వ‌లోకి దూకేసింది.

 

అయితే కాల్వ‌లో నీటి ప్ర‌వాహం ఎక్కువుగా ఉండ‌డంతో ఆమె ఆ ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. యువతిని రక్షించేందకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఆమె ఆచూకీ దొర‌క‌లేదు. ఆమె కోసం గంట నుంచి అక్క‌డ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. లభించిన టికెట్‌ ఆధారంగా ఆ యువతి ఆటో నగర్‌ నుంచి సిటీ బస్సులో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news