Newsహైద‌రాబాద్‌లో హైకోర్టు ఉద్యోగి మృతి... ఆద‌మ‌రిస్తే ఇలా కూడా చ‌నిపోవాల్సిందే..!

హైద‌రాబాద్‌లో హైకోర్టు ఉద్యోగి మృతి… ఆద‌మ‌రిస్తే ఇలా కూడా చ‌నిపోవాల్సిందే..!

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురిస్తే చాలు ఎవ‌రు ఎలా చ‌నిపోతారో తెలియ‌ని ప‌రిస్థితి. కొంద‌రు నాలాల్లో న‌డుచుకుంటూ వెళుతూ ప‌డి చ‌నిపోతున్నారు. కొంద‌రు కాల్వ‌ల్లో ప‌డి కొట్టుకుపోతున్నారు. తాజాగా శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్‌ను ముంచెత్తిన భారీ వ‌ర్షంతో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. ముషీరాబాద్‌లోని శ్రీ సాయి అపార్ట్‌మెంట్‌లో రాజ్‌కుమార్ (54) నివాసం ఉంటోంది. రాజ్‌కుమార్ హైకోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు.

నిన్న సాయంత్రం షాపింగ్‌కు వెళ్లి వ‌స్తాన‌ని బ‌య‌లు దేరిన రాజ్‌కుమార్ సెల్లార్‌లోకి వెళ్లి బైక్ బ‌య‌ట‌కు తేవాల‌నుకున్నాడు. ఈ లోగా వ‌ర్షం జోరందుకుని లోప‌ల‌కు వ‌ర‌ద నీరు వ‌చ్చింది. రాజ్‌కుమార్ లోప‌లే చిక్కుకుపోయి మృతి చెందాడు. అయితే ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరాలేదు. రాజ్‌కుమార్ మృతికి షార్ట్‌సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు.

 

ఇక హైద‌రాబాద్‌లో వ‌ర‌ద‌ల‌కు ఇటీవ‌ల ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. గత నెల 20న కురిసిన భారీ వర్షానికి సరూర్‌నగర్‌ చెరువులో పడి ఒకరు మృతి చెందారు. ఇక‌  12 ఏళ్ల సుమేధ సైకిల్‌ తొక్కుకుంటూ బయటికెళ్లి ప్రమాదవశాత్తూ ఓపెన్‌ నాలాలో పడిపోవడంతో ప్రాణాలు విడ‌వ‌డం ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచి వేసింది. ఏదేమైనా హైద‌రాబాద్‌లో చినుకు ప‌డితే బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు అజాగ్ర‌త్త‌గా ఉండ‌కూడ‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news