Moviesప‌వ‌న్ స్టామినా ఏంటో చెప్పిన వ‌కీల్‌సాబ్

ప‌వ‌న్ స్టామినా ఏంటో చెప్పిన వ‌కీల్‌సాబ్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు గ్యాప్ వ‌చ్చినా ఆయ‌న స్టామినా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఆయ‌న తాజా సినిమా వ‌కీల్‌సాబ్ మోష‌న్ పోస్ట‌ర్ చెప్పేసింది. ప‌వ‌న్ బ‌ర్త్ డే కానుక‌గా సెప్టెంబ‌ర్ 2వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ యూ ట్యూబ్‌లో దుమ్ము రేపుతూ దూసుకుపోతోంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్ ఇంకా యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిల‌వ‌డం విశేషం. ఈ పోస్ట‌ర్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఆరు గంట‌ల్లోనే నెంబ‌ర్ నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది.

ఇక ఇప్పుడు నాలుగు రోజులు అవుతున్నా కూడా మూడు మిలియ‌న్ల వ్యూస్‌తో నెంబ‌ర్ 2 ట్రెండింగ్‌లో కంటిన్యూ అవుతోంది. దీనిని బ‌ట్టి ప‌వ‌న్ సినిమాల్లో న‌టించి రెండున్న‌రేళ్లు అవుతున్నా కూడా… అది కూడా ఆయ‌న ఓ రీమేక్ సినిమాలో న‌టిస్తున్నా కూడా ఈ సినిమాపై ఎలాంటి ఆస‌క్తితో ఉన్నారో తెలుస్తోంది. దిల్ రాజు – బోనీక‌పూర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కుడు. నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రలు పోషిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news