Moviesబిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌లో అఖిల్ క్లాస్‌మేట్‌... ఎవ‌రో తెలుసా...!

బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌లో అఖిల్ క్లాస్‌మేట్‌… ఎవ‌రో తెలుసా…!

తెలుగు బుల్లితెర రియాల్టీ పాపుల‌ర్ షో బిగ్‌బాస్ 4వ సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే 15 మంది కంటెస్టెంట్ల లిస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌డంతో బుల్లితెర ప్రేక్ష‌కుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఇక ఇప్ప‌టికే షో ప్రారంభం అయ్యేందుకు కౌంట్‌డౌన్ కూడా ప్రారంభ‌మైంది. ఇదిలా ఉంటే ఈ సారి హౌస్‌లోకి వెళుతోన్న కంటెస్టెంట్ల‌లో టాలీవుడ్ క్రేజీ హీరో, న‌వ మ‌న్మ‌థుడు అక్కినేని అఖిల్ క్లాస్‌మేట్ కూడా ఒక‌రు ఉన్నారు.

అఖిల్ క్లాస్‌మెట్ ఎవ‌రో కాదు.. అభిజి… లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో హీరోగా నటించిన అభిజిత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. అఖిల్ – అభిజిత్ ఇద్ద‌రు కలిసి చైత‌న్య విద్యాల‌యంలో చ‌దువుకున్నార‌ట‌. అలా వాళ్లిద్ద‌రికి ఫ్రెండ్‌షిఫ్ ఉంది. ఇప్పుడు అఖిల్ తండ్రి నాగ్ హోస్ట్‌గా ఉన్న షోలోకి అభిజిత్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇక  అభిజిత్ కాకుండా మిగితా కంటెస్టెంట్లు టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, యాంకర్ లాస్య, జబర్దస్త్ ముక్కు అవినాశ్, యూట్యూబర్ గంగవ్వతో పాటు డైరెక్ట‌ర్ కం కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్, సింగర్ నోయల్, హీరోయిన్ మొనాల్ గజ్జర్, దేత్తడి హారిక, యాంకర్ అరియానా గ్లోరీ, ముద్దమందారం ఫేమ్ తనూజా పుట్టస్వామి, సయ్యద్ సొహైల్, యూట్యూబర్ మెహబూబా, సినీ ఆర్టిస్ట్‌ కరాటే కళ్యాణి,   టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సూర్య కిరణ్ మిగిలిన కంటెస్టెంట్లుగా ఉన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news