Moviesబ‌న్నీకి రౌడీ పంపిన స్పెష‌ల్ గిఫ్ట్ ఇదే..

బ‌న్నీకి రౌడీ పంపిన స్పెష‌ల్ గిఫ్ట్ ఇదే..

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం ఓ ఐకాన్ అయిపోయాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్‌లో కేర‌ళ వంటి చోట్ల కూడా మ‌నోడు పెద్ద స్టైలీష్‌స్టార్ అయిపోయాడు. ఇప్పుడు బ‌న్నీ ఫాలో అయ్యే ట్రెండ్స్‌ను యూత్‌లో చాలా మంది ఫాలో అవుతున్నారు. ప్ర‌స్తుతం అల వైకుంఠ‌పురంలో లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కుతోంది.

ఇక బ‌న్నీతో పాటు మ‌రో యంగ్ క్రేజీ హీరో కూడా పాన్ ఇండియా రేంజ్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఆ హీరో ఎవ‌రో కాదు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం పూరి జగ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ సినిమాలో న‌టిస్తోన్న విజ‌య్ పాన్ ఇండియా రేంజ్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా బాలీవుడ్‌లో కూడా రిలీజ్ కానుంది. ఇక విజ‌య్‌, బ‌న్నీ మ‌ధ్య మంచి అనుబంధం కూడా ఉంది.

ఈ క్ర‌మంలోనే విజయ్‌ బన్నీకి ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ను పంపారు. ఇంత‌కు ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతాం. రౌడీ వేర్ నుంచి నుంచి స్పెష‌ల్‌గా త‌యారు చేయించిన టీ ష‌ర్ట్స్‌, స్పెష‌ల్ ట్రాక్‌, డిజైన్ మాస్కులు బ‌న్నీకి పంపార‌ట‌. ఈ గిఫ్ట్‌లు అందుకున్న బ‌న్నీ త‌న ఇన్‌స్టాలో విజ‌య్‌కు థ్యాంక్స్ చెప్పారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news