Moviesసినిమాకు వ‌స్తావా అని ఆ హీరోయిన్‌ను డైరెక్టుగా అడిగేసిన నాని..

సినిమాకు వ‌స్తావా అని ఆ హీరోయిన్‌ను డైరెక్టుగా అడిగేసిన నాని..

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. నాని న‌టించిన తాజా సినిమా వీ సినిమా  ఈ రోజు అమోజాన్ డిజిట‌ల్ స్ట్రీమింగ్లో రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే నాని సినిమాకు వెళ‌దామా ? అని ఓ హీరోయిన్ ను డైరెక్టుగా అడిగేశారు. నాని సినిమాకు వెళ‌దాం ? అని అడిగిన ఆ హీరోయ‌న్ ఎవ‌రో కాదు… లావ‌ణ్య త్రిపాఠి.

 

నాని – లావ‌ణ్య జంట‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా ఐదేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సంద‌ర్బంగా నాటి సినిమా తీపిగుర్తులు గుర్తు చేసుకుంటూ లావ‌ణ్య ఓ స్పెష‌ల్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు నాని రిప్లే ఇచ్చాడు.

థ్యాంక్ యు నంద‌న రేపు ప్ర‌సాద్ ల్యాబ్‌లో సినిమాకు వెళ‌దామా ? అని కామెంట్ పెట్టాడు. వెంట‌నే మ‌ళ్లీ ఓ థియేట‌ర్లు లేవు క‌దా ?  మ‌ర్చిపోయాను అంటూ రిప్లే ఇచ్చాడు. ఇక నాని కెరీర్‌లో భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఎంత సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత నాని ఒక్క‌సారిగా స్టార్ హీరోలీగ్‌కు చేరువ‌య్యాడు. ఇక నానికి ఓవ‌ర్సీస్ మార్కెట్ పెర‌గ‌డంలో కూడా ఈ సినిమా ఎంతో యూజ్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news