Moviesకార్తీక‌దీపం వంట‌ల‌క్క భ‌ర్త ఎవ‌రో తెలుసా..!

కార్తీక‌దీపం వంట‌ల‌క్క భ‌ర్త ఎవ‌రో తెలుసా..!

తెలుగు బుల్లితెర అభిమానుల‌కు కార్తీక‌దీపం వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బుల్లితెర‌పై మ‌హామ‌హా ప్రోగ్రామ్‌ల‌కే షాక్ ఇస్తూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్‌తో కార్తీక‌దీపం దూసుకుపోతోంది. ఎన్ని సినిమాలు వ‌చ్చినా, ఎన్ని కొత్త ప్రోగ్రామ్స్ వ‌చ్చినా వంట‌ల‌క్క న‌టించే కార్తీక‌దీపం సీరియ‌ల్‌గా ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చివ‌ర‌కు కార్తీక‌దీపం సీరియ‌ల్ కోస‌మే ఐపీఎల్ టైమింగ్స్ మార్చాల‌న్న డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఈ సీరియ‌ల్‌కు ఇందులో ఉన్న వంట‌ల‌క్క పాత్ర‌కు ఎంత క్రేజ్ ఉందో అర్థ‌మ‌వుతోంది.

 

 

స్వ‌త‌హాగా మ‌ళ‌యాళీ అయిన ఈ వంట‌ల‌క్క అస‌లు పేరు ప్రేమి విశ్వ‌నాథ్‌. రేపు ఈ సీరియ‌ల్ కంప్లీట్ అయ్యి బుల్లితెర ప్రేక్ష‌కులు ఈ సీరియ‌ల్‌ను మ‌ర్చిపోరు. ఇక సీరియ‌ల్‌లో ఈ వంట‌ల‌క్క భ‌ర్త డాక్ట‌ర్ బాబు గురించి అంద‌రికి తెలుసు. అయితే ఈ వంట‌ల‌క్క రియ‌ల్ భ‌ర్త ఎవ‌రో తెలుసా డాక్ట‌ర్ వినీత్ భ‌ట్‌. వంట‌ల‌క్క‌కు బుల్లితెర మీద ఎంత పేరు ఉందో … ఆమె డాక్ట‌ర్‌కు కూడా అంతే క్రేజ్ ఉంది. ఇలా వీరిద్ద‌రు త‌మ త‌మ రంగాల్లో రాణిస్తూ పాపుల‌ర్ అవుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news