Moviesసీనియ‌ర్ హీరో సుమ‌న్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా...

సీనియ‌ర్ హీరో సుమ‌న్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా…

నిన్న‌టి త‌రం హీరోల్లో సుమ‌న్ స్పెషాలిటీయే వేరు. సుమ‌న్ అంటే కరాటేకు, కున్‌ఫూకు పెట్టింది పేరు. ఒకానొక టైంలో అప్ప‌ట్లో ఉన్న స్టార్ హీరోల‌కు పోటీగా ఉన్న సుమ‌న్‌ను అప్ప‌ట్లో రాజ‌కీయాలు చేసి కొంద‌రు తొక్కేశారు అన్న టాక్ కూడా ఉంది. అప్ప‌ట్లో తిరుగులేని స్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీకే పోటీ ఇచ్చిన న‌టుడు సుమ‌న్‌. తిరుగులేని అందం, సుమ‌న్ అంటే ప‌డి చ‌చ్చే హీరోయిన్లు, డ్యాన్సులు, ఫైట్లు ఇవ‌న్నీ సుమ‌న్‌కు సొంత అయ్యాయి.

అనుకోని కార‌ణాల వ‌ల్ల జైలుకు వెళ్లిన సుమ‌న్ ఆ త‌ర్వాత జైలు నుంచి వ‌చ్చి హీరోగా చేసినా ఆ సినిమాలు స‌క్సెస్ కాలేదు. త‌ర్వాత కెరీర్‌లో ఆయ‌న ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సుమ‌న్ ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత డివి. న‌ర‌స‌రాజు గారి మ‌న‌వ‌రాలు శిరీష‌ను వివాహం చేసుకున్నాడు. అప్ప‌ట్లో సుమ‌న్ కు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ‌. జైలు నుంచి వ‌చ్చాక క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, విల‌న్‌గా న‌టించి మెప్పించాడు. ఇక సుమ‌న్ కుమార్తె పేరు అఖిల‌జ ప్ర‌త్యూక్ష‌.

అఖిల‌జ స్వ‌త‌హాగా మంచి డ్యాన్స‌ర్‌. ఆమెకు అందంతో పాటు అభిన‌యం కూడా ఉంది. అయినా ఆమె మాత్రం సినిమా రంగానికి పూర్తి దూరంగా ఉంది. ఆమెను సినిమాల్లో న‌టించ‌మ‌ని ఎంతో మంది కోరినా సుమ‌న్ మాత్రం వాటిని తోసిపుచ్చాడు త‌న కుమార్తెను సినిమా రంగానికి దూరంగా ఉంచాడు. ఇక సుమ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా రేప‌ల్లె నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకున్నా కుద‌ర్లేదు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news