Gossipsషాక్‌: అటూ ఇటూ తిరిగి అత‌డితో మూడు ముళ్లుకు రెడీ అవుతోన్న...

షాక్‌: అటూ ఇటూ తిరిగి అత‌డితో మూడు ముళ్లుకు రెడీ అవుతోన్న త్రిష‌..!

చెన్నై చిన్న‌ది త్రిష ఎఫైర్లు, పెళ్లిపై వ‌చ్చిన‌న్ని పుకార్లు ఏ హీరోయిన్‌పై కూడా రాలేద‌నే చెప్పాలి. ముందుగా కోలీవుడ్ హీరో శింబుతో ప్రేమాయ‌ణం.. ఆ త‌ర్వాత సిద్ధార్థ్‌తో… ఆ త‌ర్వాత టాలీవుడ్ హీరో ద‌గ్గుబాటి రానాతో ఎఫైర్లు కొన‌సాగించిన వార్తలు మ‌నం కోకొల్లలుగా చూశాం. వీరిలో కొంద‌రితో ఆమె ప్రేమాయ‌ణం న‌డుపుతూ ప‌బ్లిక్‌గానే దొరికిపోయిన సంఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. ఇక మూడేళ్ల క్రితం పారిశ్రామిక‌వేత్త వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో ఆమె ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. పెళ్లికి రెడీ అవుతోన్న స‌మ‌యంలో ఏం జ‌రిగిందో కాని ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయారు.

Trisha and Simbu entering into wedlock? - Kaumudiglobal | DailyHunt

అప్ప‌టి నుంచి త్రిష పెళ్లిపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా ప్రస్తుతం కోలీవుడ్ మీడియా అంతా త్రిష చుట్టూ తిరుగుతుంది. త్రిష ఓ క్ష‌ణంలో అయినా పెళ్లి చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటూ వ‌స్తోన్న ఆమె త‌న సోష‌ల్ మీడియా అక్కౌంట్ల‌లో ఉన్న పాత ఫొటోలు.. పాత స్నేహితుల ఫోటోలు అన్నింటిని డిలీట్ చేస్తోంది. ఈ చ‌ర్య‌ల‌ను గ‌మ‌నిస్తోన్న వారు సైతం ఆమె ఎప్పుడైనా పెళ్లి చేసుకోవ‌చ్చ‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు.

Jesse and Karthik reunite'; Chimp and Trisha get married; Report ...

ఇంత‌కు త్రిష పెళ్లి వార్త‌లు ఎవ‌రితో వ‌స్తున్నాయో తెలిస్తే అది పెద్ద షాకింగే అనుకోవాలి. కోలీవుడ్ మ‌న్మ‌థుడు శింబునే ఆమె పెళ్లాడ‌బోతోంద‌ని.. త్రిష‌ను పెళ్లి చేసుకునేందుకు శింబు త‌ల్లిదండ్రులు ఉష‌, రాజేంద‌ర్ కూడా ఓకే చెప్పార‌ని అంటున్నారు. వీరిద్ద‌రు సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నార‌న్న వార్తలు కూడా ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. కేవలం శింబుతో పెళ్లి కోసమే ఆమె కొత్త సినిమాలు ఒప్పుకోలేదనే పుకారు నడుస్తోంది. అందుకే ఏకంగా చిరు స‌ర‌స‌న ఆచార్య సినిమాను సైతం ఆమె రిజెక్ట్ చేసింద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news