Moviesబ్రేకింగ్‌: మ‌రింత విష‌మంగా బాల సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం... వాళ్ల‌పైనే ఆఖ‌రి ఆశ‌లు

బ్రేకింగ్‌: మ‌రింత విష‌మంగా బాల సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం… వాళ్ల‌పైనే ఆఖ‌రి ఆశ‌లు

లెజెండ్రీ సింగ‌ర్ ఎస్పీ. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం మ‌రింత విష‌మించిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన క‌రోనా వైర‌స్‌తో చెన్నైలోని ఎంజీఎం హాస్ప‌ట‌ల్లో చేరిన బాలు ఆరోగ్యం ఆ త‌ర్వాత మ‌రింత విష‌మిస్తూ వ‌స్తోంది. ఆయ‌న‌కు ముందుగా క‌రోనా సోకింది. ఆ త‌ర్వాత ఆయ‌న భార్య‌కు సైతం క‌రోనా వ‌చ్చింది. క‌రోనా త‌గ్గినా కూడా బాలు ఆరోగ్యం మాత్రం కంట్ర‌ల్లోకి రాలేదు. బాలు అవ‌య‌వాల ప‌నితీరు తాము నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌ని.. అయితే అప్పుడే ఆయ‌న ఆరోగ్యం గురించి తాము ఏం చెప్ప‌లేమ‌ని చెన్నై ఎంజీఎం వైద్యులు చెపుతున్నారు.

 

ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుని బ‌య‌ట ప‌డ‌తార‌న్న ఆశాభావం తాము వ్య‌క్తం చేస్తున్న‌ట్టు చెప్పారు. అయితే ఆయ‌న ఆరోగ్యం విష‌మిస్తోన్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ నిపుణుల స‌హ‌కారం తీసుకుంటున్నారు. వీరి సూచ‌నల మేర‌కు ఇక్క‌డ వైద్యం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక వారు ఇచ్చే సూచ‌న‌ల మేర‌కు బాలు ఆరోగ్య ప‌రిస్థితి వ‌స్తే మార్పు రావాల‌ని అంద‌రూ ఆశ‌లు పెట్టుకుంటున్నారు. ఇక బాలు క్షేమంగా తిరిగి రావాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news