Gossipsగీతా గోవిందం.. రిలీజ్ ముందే కథ లీక్..స్క్రీన్ ప్లేపైనే భారమంతా..!

గీతా గోవిందం.. రిలీజ్ ముందే కథ లీక్..స్క్రీన్ ప్లేపైనే భారమంతా..!

అర్జున్ రెడ్డి తర్వాత టాక్సీ వాలాని వెనక్కి నెట్టి విజయ్ దేవరకొండ చేస్తున్న గీతా గోవిందం రిలీజ్ కు ఫిక్స్ అయ్యింది. పరశురాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ చూసి ఇంప్రెస్ అవగా రొటీన్ సినిమాగానే గీతా గోవిందం వస్తుందని తెలుస్తుంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం హీరోని ప్రేమించే తరుణంలో ఆమె పర్మిషన్ లేకుండా ముద్దుపెట్టుకుంటాడు హీరో. తన తప్పు సవరించుకునే క్రమంలో హీరోయిన్ వెంట పడతాడు. ఇక హీరో, హీరోయిన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాగా ఆ టైంలో హీరోకి హీరోయిన్ ఎలాంటి పనిష్ మెంట్ ఇచ్చింది. చివరకు హీరో చేసిన ఏ పనుల వల్ల ఆమె అతన్ని క్షమించింది అన్నది సినిమా కథట.

ఈ సినిమా కథ రొటీన్ గానే ఉంది. సినిమా మొత్తం స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా నడుస్తుందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. గోపి సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news