Moviesపెద్ద హీరోతో కాదు అని చిన్న హీరోతో రీ ఎంట్రీ ఇస్తున్న...

పెద్ద హీరోతో కాదు అని చిన్న హీరోతో రీ ఎంట్రీ ఇస్తున్న అన్షు.. భారీ బొక్క తప్పదా..?

సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు యంగ్ ఏజ్ లో ఓ రేంజ్ లో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకొని కుర్రాళ్లకు కనువిందు చేస్తూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దు అన్షు అంబానీ . చేసింది తక్కువ సినిమాలే కాని ఇప్పటికీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అభిమానులు ఆమెపై పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. హీరో నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో ఓ రేంజ్ లో స్టార్ట్ హీరోయిన్ గా మారిపోయింది.

ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ ఎంత హైలైట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా ..? ఆ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో కూడా నటించి మెప్పించింది. అయితే సడన్ గా ఇండస్ట్రీకి దూరమైపోయింది . పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది . కాగా సోషల్ మీడియా పుణ్యమా అంటూ మళ్ళీ అన్షూ అంబానీ పేరు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . తాజాగా ఆమె పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

యంగ్ హీరోతో మళ్లీ రి ఎంట్రీ ఫిక్స్ చేసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది . సందీప్ కిషన్ – త్రినాధరావు నెత్తిన దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్ మీద రాజేష్ దండ ఓ సినిమాని నిర్మిస్తున్నారు . ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర కోసం సెలెక్ట్ అయిందట . దర్శకుడు కూడా ఆమెనే ఈ పాత్ర కోసం పెట్టాలి అంటూ బాగా ట్రై చేసి మరి ఆమె చేత ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారట .

అయితే ఆల్ రెడీ అమ్మడికి బి సినిమాలో ఆఫర్ వచ్చిందట. కానీ అది అక్క పాత్ర కావడంతో రిజెక్ట్ చేసిందట. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు గతంలో కూడా అన్షు అంబానికి చాలా ఆఫర్స్ వచ్చాయని.. కానీ వాటిని రిజెక్ట్ చేసింది అని ఇప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీలో నటించడానికి సిద్ధంగా ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. చూద్దాం మరి దీనిపై అన్షు అంబానీ ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news