Movies"ఎవ్వడు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన నా సినిమాలో హీరోయిన్ ఆమె".. నాగార్జున ఈ...

“ఎవ్వడు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన నా సినిమాలో హీరోయిన్ ఆమె”.. నాగార్జున ఈ రేంజ్ లో తెగించేసాడు ఏంటి..?

నాగార్జున ఇండస్ట్రీలో మన్మధుడుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అఫ్ కోర్స్ సీనియర్ హీరోనే.. కానీ ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో సగానికి మందికి పైగా లేడీస్ తమ ఫేవరెట్ హీరో ఎవరు అంటే అక్కినేని నాగార్జున పేరు చెప్తారు. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు . వయసు అయిపోతున్న సరే ఇంకా యంగ్ లుక్స్ లో అమ్మాయిల కలలో రాకుమారుడుగా రాజ్యమేలుస్తున్న టాలీవుడ్ కింగ్ అనే చెప్పాలి.

ఈ మధ్యకాలంలో నాగార్జున చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరిగినా సరే తనకు సంబంధం లేదు అంటూ చూసి చూడనట్లు వదిలేస్తున్నారు .మరి ముఖ్యంగా తన కొడుకుల హిట్ల కన్నా కూడా తన కెరియర్ ఇంపార్టెంట్ అన్న రేంజ్ లో ముందుకెళ్ళిపోతున్నాడు. ఎవరి టాలెంట్ వాడిది ఎవరి సత్తా వాడిది ఒకరి రికమండేషన్స్ తో పైకి రాకూడదు అనుకునే టైపు అక్కినేని నాగార్జున. రీసెంట్ గా ఆయన తన 100 సినిమా కోసం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. పలువురు డైరెక్టర్లు ఆయనను అప్రోచ్ అవుతున్న సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ..

కచ్చితంగా తన 100వ సినిమా తన కెరీర్ కు గుర్తుండి పోవాలి అని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు . ఈ క్రమంలోనే తన సినిమాలో డైరెక్టర్ ఎవరైనా అయ్యుండొచ్చు ..కానీ హీరోయిన్ మాత్రం అందాల ముద్దుగుమ్మ త్రిషనే అంటూ ఫిక్స్ అయిపోయాడట . ఆల్రెడీ త్రిష చేత ప్రామిస్ కూడా చేయించుకున్నాడట . ప్రజెంట్ ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది.

నాగార్జున త్రిష కాంబోలో వచ్చిన సినిమాలు ఎలాంటి హిట్ అందుకుంటాయో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో క్రేజీ కాంబో వీళ్లది . మరి అలాంటి కాంబో రెండోసారి జత కడుతూ ఉంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా..? రచ్చ రంబోలాగా చేసేయరు. అయితే నాగార్జున ఎందుకు త్రిష ను ఈ రేంజ్ లో కమిట్ అయ్యాడు అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి హీరోయిన్ ఫిక్స్ అయిన నాగార్జున డైరెక్టర్ ని ఎప్పుడు ఫిక్స్ అవుతాడో చూద్దాం..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news