Moviesతెలుగు హీరోలు జాన్వి అంటే ఎగబడడానికి కారణం అదేనా..? ఆ ఒక్కటి...

తెలుగు హీరోలు జాన్వి అంటే ఎగబడడానికి కారణం అదేనా..? ఆ ఒక్కటి లేకపోతే అమ్మడు నత్తింగ్గా..?

జాన్వి కపూర్.. జాన్వి కపూర్.. జాన్వి కపూర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు .. చేతిలో నాలుగు సినిమాలకు పైగానే పట్టుకొని ఉంది. అఫీషియల్ గా రెండు సినిమాలను ఓకే చేస్తే.. అనఫిషియల్ గా రెండు సినిమాలు బ్యాక్ గ్రౌండ్లో పెట్టుకొని ఉంది . జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది జాన్వి కపూర్ .

ఈ సినిమా ద్వారానే తెలుగులోకి డెబ్యూ ఇవ్వబోతుంది . ఈ సినిమా ఇంకా రిలీజ్ కాక ముందే..రామ్ చరణ్ సరసన నటించే అవకాశం అందుకుంది . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అంతేకాదు పుష్ప 2 సినిమాలో కూడా జాన్వి కపూర్ స్పెషల్ అపీరియన్స్ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

అదే కాకుండా అఖిల్ – విజయ్ దేవరకొండ సినిమాలు కూడా కమిట్ అయిందట . ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉండగా.. ఎందుకు జాన్వికపూర్ కోసమే తెలుగు హీరోలు ఎగబడి పోతున్నారు అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. జాన్వి కపూర్ ని చూసి కాదు అని .. శ్రీదేవి కు ఉన్న ఫిలిం బ్యాక్ గ్రౌండ్.. ఆమె నటన .. ఆమె పలుకుబడి.. ఆమె గౌరవం కారణంగానే జాన్వికపూర్ కు తెలుగులో అవకాశాలు ఇస్తున్నారు.. స్టార్ హీరోలు అంటూ శ్రీదేవి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి తల్లి క్రేజ్ తో తెలుగులో బాగానే ఆఫర్లు అందుకుంటుంది జాన్వి కపూర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news