Moviesనందమూరి ఫ్యాన్స్ కొత్త డిమాండ్ ..బాలయ్యను అలాంటి పాత్రలో చూడాలి అని...

నందమూరి ఫ్యాన్స్ కొత్త డిమాండ్ ..బాలయ్యను అలాంటి పాత్రలో చూడాలి అని అనుకుంటున్నారట..!!

ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోని ఏ పాత్రలో చూడాలి..? ఎలాంటి డైరెక్షన్లో చూడాలి..? ఏ క్యారెక్టర్ లో తమ హీరో కనిపిస్తే బాగుంటుంది..? అన్న విషయాలను చాలా ఓపెన్ గా సోషల్ మీడియా వేదిక ద్వారా ఆ హీరోలకి తెలియజేస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో నందమూరి అభిమానుల కొత్త కోరిక బాగా వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం గా ట్యాగ్ చేయించుకున్న బాలయ్య .. ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల కారణంగా కొన్నాళ్లపాటు ఆ ఫిలిం షెడ్యూల్ కి బ్రేక్ చెప్పారు . వన్స్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత చక చక ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసే పనిలో బిజీ అవ్వబోతున్నారట బాలయ్య . ఇలాంటి క్రమంలోనే బాలయ్యను చత్రపతి శివాజీ క్యారెక్టర్ లో చూడాలి అని ఉంది అంటూ కొందరు నందమూరి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

బాలయ్య ఆ పాత్రకు బాగా సూట్ అవుతాడు అని.. ఎవరైనా డైరెక్టర్స్ అలాంటి పాత్రను బాలకృష్ణ కోసం ట్రై చేయండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు . దీంతో నందమూరి ఫ్యాన్స్ కొత్త కోరిక నెట్టింట బాగా వైరల్ గా మారింది. కెరియర్ లో చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించిన నందమూరి బాలయ్య ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో లీనమైపోయినటిస్తాడు . అంతేకాదు బాలయ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . ప్రెసెంట్ యంగ్ జనరేషన్ హీరోలకి కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు బాలయ్య. దానికి కారణం ఆయనకున్న ఎనర్జీ లెవెల్స్ అని చెప్పుకోక తప్పదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news