Moviesజనాలు రష్మిక అంటే పడి చచ్చిపోవడానికి కారణం అదే..ఆ ఒక్కటి లేకుంటే...

జనాలు రష్మిక అంటే పడి చచ్చిపోవడానికి కారణం అదే..ఆ ఒక్కటి లేకుంటే ఐటెం గార్ల్ గా కూడా పనికి రాదా..?

రష్మిక మందన్నా.. ఈ పేరు చెప్తే ఊగిపోని అబ్బాయ్ ఉంటాడా..? పేరుతోనే కిక్కెక్కించే బ్యూటీ. పాన్ ఇండియా హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . ఛలో సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మహేష్ బాబు – అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశం అందుకుంది . సరిలేరు నీకెవరు సినిమాతో మహేష్ బాబుతో రొమాన్స్ చేసి అదరగొట్టింది. పుష్ప సినిమాతో బన్నీతో సామీ సామి అంటూ నడుమును తిప్పేసింది. రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

పుష్ప సినిమాతో తన తలరాతనే మార్చేసుకుంది రష్మిక . ఆ తరువాత వచ్చిన యానిమల్ సినిమా రష్మికకు బోల్డ్ బ్యూటీ అంటూ కొత్త ట్యాగ్ ని కూడా ఇచ్చింది . ప్రజెంట్ రష్మిక తెలుగులో మూడు సినిమాలు బాలీవుడ్ లో ఆరు సినిమాలతో బిజీగా ఉంది . ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వచ్చే రష్మిక మందన్నా రీసెంట్ గా అరుదైన గౌరవం అందుకుంది . వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా వెర్షన్ లో రష్మిక ప్రత్యేక ఆర్టికల్ని సంపాదించుకున్నారు .

ఇండియాలో ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఎదుగుతున్న యంగ్ హీరోయిన్స్ ..యువ వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు స్టార్స్ కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక ఆర్టికల్ ప్రచురించింది. ఈ ఆర్టికల్ లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రష్మిక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవడం విశేషం . ఇతర యంగ్ టాలెంట్ తో కలిసి కవర్ పేజీపై స్టిల్ ఇచ్చిన రష్మిక.. తన ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు . ఈ ఫోటో చూసినా అభిమానులు రష్మిక ను అభినందిస్తున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. రష్మిక ఇంతటి స్ధానం దక్కించుకోవడానికి కారణం ఆమె అభిమానులని..ఆ ఫ్యాన్స్ లేకపోతే ఐటెం గర్ల్ గా కూడా పనికి రాదు అని కౌంటర్స్ వేస్తున్నారు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news