Moviesబిగ్ షాకింగ్: ఊహించని చిక్కుల్లో మహేశ్ బాబు..ఇలా అడ్డంగా దొరికిపోయాడు ఏంటి..?

బిగ్ షాకింగ్: ఊహించని చిక్కుల్లో మహేశ్ బాబు..ఇలా అడ్డంగా దొరికిపోయాడు ఏంటి..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్స్ నెలకొంటున్నాయో మనం చూస్తున్నాం. ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆ సినిమా కధ మాదే అంటూ కొంతమంది కోర్టుకెక్కుతున్నారు . అలాంటి వార్తలను మనం ఈ మధ్యకాలంలో బాగా విన్నం . మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా పై ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తూ ఉండడం గమనార్హం . ఈ సినిమాలో తనదైన స్టైల్ లో తెరకెక్కించాడు కొరటాల శివ .

అయితే శరత్ చంద్ర ఈ కథ నాదే అంటూ కోర్ట్లో కేసు వేశాడు . స్వాతి వార పత్రికలో ప్రచురితమైన తన” చచ్చేంత ప్రేమ కథ ” నుండి కొన్ని సీన్స్ కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారు అంటూ శరత్ చంద్ర ఆరోపిస్తూ కోర్టులో కేసు వేశారు . ఇప్పటికీ ఈ కేస్ కోర్టులో నడుస్తుంది . రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ అయినా బేబీ సినిమా కూడా కాపీ వివాదం ఎదుర్కొంటుంది . ఆ స్టోరీ తనదే అంటూ సిరిన్ శ్రీరామ్ అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఫిర్యాదు చేశారు . 2015లో తాను రాసుకున్న ” ప్రేమించదు” అనే కథను సాయి రాజేష్ కు చెప్పానని ..ఆయన కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి మరీ బేబీ కాదని తెరకెక్కించారు అని చెప్పుకొచ్చారు .

అయితే ఇప్పుడు మరోసారి మహేష్ బాబు చిక్కుల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది . మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా కూడా కాపీ వివాదాన్ని ఎదుర్కొంటుంది . ఆర్.డి విల్సన్ రావు అలియస్ శరత్ చంద్ర యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ సినిమాపై సంచలన ఆరోపణలు చేశారు . తాను రాసిన సమాహారం”” అనే నవల లోని కొన్ని సన్నివేశాలను బేస్ చేసుకుని ఈ చిత్రంను తెరకెక్కించారు అని ..శ్రీమంతుడు కేసు పై తీర్పు వెళ్ళవడగానే మహర్షి సినిమాపై హక్కు పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తాను అని చెప్పుకొచ్చాడు. దీంతో శరత్ చంద్ర కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా మహేష్ బాబు నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ కాపీ వివాదాన్ని ఎదుర్కొంటూ ఉండడం అభిమానులకి ఇబ్బందికరంగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news