Movies"అది ఉన్న వాడే బాయ్ ఫ్రెండ్ గా కావాలి".. సురేఖా వాణీ...

“అది ఉన్న వాడే బాయ్ ఫ్రెండ్ గా కావాలి”.. సురేఖా వాణీ డేరింగ్ కామెంట్స్ కి కుర్రాళ్లు మీటర్లు బ్లాస్ట్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ హీరోయిన్స్ ఏ కాదు .. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బాగానే పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . మరి ముఖ్యంగా యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ పుణ్యమాంటూ సామాన్య జనాలు కూడా స్టార్ సెలబ్రిటీస్ అయిపోతున్నారు . ఉన్న విషయాన్ని ఉన్నట్టే మాట్లాడడం . ఎదుటి వాళ్లపై తమ ఒపీనియన్ నిర్మొహమాటంగా చెప్పేయడం.. సోషల్ మీడియా వల్ల జరిగింది అని చెప్పొచ్చు . కాగా సోషల్ మీడియాలో నిరంతరం ఆక్టివ్ గా ఉండే వాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూడా ఒకరు .

ఎంత చక్కగా ఉంటుందో.. అందంగా ఉంటుందో .. ఆమె గురించి ఎంత చెప్పకున్నా తక్కువే . తెలుగులో ఎన్నో సినిమాలలో అక్క – వదిన – అమ్మ పాత్రలో నటించిన సురేఖ వాణి .. తెర వెనక మాత్రం టూ హాట్ ..టూ బోల్డ్ గా నచ్చినట్లు ఉంటుంది . ఆఫ్కోర్స్ అది ఆమె రైట్.. ఆమె ఇష్టం ఎలాగైనా ఉండొచ్చు .. అయితే పలువురు జనాలు మాత్రం తెర వెనక ఆమె ఉండే పద్ధతిని ట్రోల్ చేస్తూ ఉంటారు . మరి కొందరు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు . తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి .. నవ్వుకునే వాళ్ళు నవ్వుకోండి .. నాకు సంబంధం లేదు అంటూ తన లైఫ్ని తాను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సురేఖ వాణి .

ముఖ్యంగా కూతురు సుప్రీతతో కలిసి చేసే రచ్చ మామూలుగా ఉండదు . వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లు అనడం కన్నా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనడం చాలా చాలా బాగుంటుంది. అలాగే అంటూ ఉంటారు అభిమానులు . రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన తల్లి కూతుర్లు ఫన్నీ ఫన్నీ ఆన్సర్లతో ఆకట్టుకున్నారు . సుప్రిత మాట్లాడుతూ..” నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటే ..నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటుంది సురేఖా వాణీ.. దీంతో సుప్రీత షాక్ అయిపోతుంది.. అంతేకాదు నాకు మంచి మనసున్న వ్యక్తి అయి ఉండాలి ..నైస్ ఫిజిక్ ఉండాలి “అంటూ చెప్పుకొస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సురేఖ వాణి చేసిన క్రేజీ కామెంట్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కొందరు బూతులు తిడుతుంటే మరికొందరు ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పడంలో తప్పులేదు అంటూ ఆమె డేర్ నెస్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news