Moviesఅప్పుడు పవన్ కొడుకు..ఇప్పుడు నాని కొడుకు .. ఈ స్టార్ వారసులకు...

అప్పుడు పవన్ కొడుకు..ఇప్పుడు నాని కొడుకు .. ఈ స్టార్ వారసులకు ఈ పిచ్చి ఏంటి రా బాబు..!!

జనరల్ గా చాలామంది అంటూ ఉంటారు హీరో కొడుకు హీరోనే అవ్వాలి అని.. దానికి తగ్గ పక్కా ప్లానింగ్స్ ఆ హీరోలు ఎప్పటినుంచో చేసేస్తూ ఉంటారు అని ..సినిమా ఇండస్ట్రీలో అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి . అయితే కొందరు వారసులు మాత్రం ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ సెట్ చేస్తున్నారు . వాళ్ళల్లో ఒకరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ..హీరో అయితే చూడాలి అనేది కోట్లాదిమంది పవన్ అభిమానుల కోరిక .

అయితే అఖీరాకి మాత్రం హీరో అవ్వాలని లేదు . ఈ విషయాన్ని చాలా సార్లు వాళ్ళ అమ్మగారు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు . అకిరానందన్ మ్యూజిక్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. మ్యూజిక్ వైపే ఎక్కువగా అడుగులు వేస్తున్నారు. అకిరా పియానో నేర్చుకుంటూ అందులో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు . ఆ మధ్య ఒక షార్ట్ ఫిలిం కి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. మొన్నటికి మొన్న సంక్రాంతి మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో అనిమల్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ ని పియానో ద్వారా ప్లే చేసి అభిమానులను అట్రాక్ట్ చేశాడు .

అయితే ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అయిపోతున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని కొడుకు ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎదిగిన నాని కొడుకు ప్రెసెంట్ పియానో వాయిస్తున్న వీడియో వైరల్ గా మారింది. అర్జున్ పియానో ప్లే చేస్తున్న వీడియోని వాలెంటైన్స్ డే సందర్భంగా నాని పోస్ట్ చేశారు . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఏడేళ్ల వయసులోనే అర్జున్ ఇలా ఇంత బాగా పియానో వాయిస్తున్నాడు అని జనాలు మురిసిపోతున్నారు . ఆ లవ్లీ వీడియో పై మీరు ఓ లుక్కేయ్యండి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news