Movies"ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎన్టీఆర్ కోసం ఆ పని చేయించారు".. సంచలన...

“ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎన్టీఆర్ కోసం ఆ పని చేయించారు”.. సంచలన విషయాన్ని బయటపెట్టిన మణిశర్మ..!!

మణిశర్మ .. ఇప్పటి జనాలకు ఈ పేరు పెద్దగా ఎక్కదేమో కానీ ఒకప్పటి జనరేషన్ కి మాత్రం మణిశర్మ అంటే విపరీతంగా నర నరాల్లోకి ఎక్కిస్తుంది. చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ – పవన్ కళ్యాణ్ -మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ కి కెరియర్ లో గుర్తుండిపోయే సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన ఘనత మణిశర్మకే దక్కుతుంది . సినిమాలు ఫ్లాప్ అయినా సరే మ్యూజిక్ హిట్ అయింది అంటే దానికి కారణం మణిశర్మ అని చెప్పాలి.

అయితే అలాంటి మణిశర్మ ప్రస్తుతం అవకాశాల లేక బాధపడి పోతున్నారు . ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మణిశర్మ ఇప్పుడు ఫుల్ బరస్ట్ అయిపోయారు . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మణిశర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మణిశర్మ ఇచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమాలలో ఎన్టీఆర్ నటించిన ఆది కూడా ఒకటి. ఫ్యాక్షన్ డ్రామా తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకుంది .

ఈ సినిమాకి సంగీతం కూడా మరో హైలెట్గా నిలిచింది . ఈ సినిమాలోని ప్రతి సాంగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది . ఇప్పటికీ టీవీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నామంటే కారణం అదే . అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ ని కాపీ చేయాల్సి వచ్చిందట మణిశర్మ. అది ఆయనకి ఇష్టం లేకపోయినా దర్శక నిర్మాతల బలవంతం మీదనే కాపీ చేశారట. ఈ సినిమాల్లోని “చిక్ చిక్ బం బం” అనే సాంగ్ ని మణిశర్మ టర్కిష్ అనే పాట నుంచి కాపీ చేశారట . ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు మణిశర్మ. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు మణి శర్మ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news