Moviesహమ్మయ్య.. ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. ఫ్యాన్స్ కి మళ్ళీ...

హమ్మయ్య.. ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. ఫ్యాన్స్ కి మళ్ళీ పెద్ద పండగే..!

ఇది నిజంగా సమంత అభిమానులకి వెరీ బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. హీరోయిన్ సమంతకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఆమె టాప్ హీరోయిన్ . ఇప్పటికి సినిమాలు చేయకపోయినా సరే ఆమెను ఆరాధించే జనాలు అభిమానులు ఎక్కువగా ఉంటారు . కాగా మయోసైటిస్ వ్యాధికి గురైన తర్వాత సమంత కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పిన విషయం తెలిసిందే.

రీసెంట్గా సమంత తన సినిమా వర్క్ స్టార్ట్ చేసింది . ఇదే విషయాన్ని అఫీషియల్ గా చెప్పుకొచ్చింది . గతంలో ఆమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ సరసన వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ ను ప్రియాంక చోప్రా హాలీవుడ్లో చేసింది . దానికి రీమేక్ గానే బాలీవుడ్ లో తెరకెక్కినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి ఆల్మోస్ట్ రెండేళ్లు అయిపోయింది. సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయిన సమంత హెల్త్ బాగోలేని కారణంగా కొన్ని వర్క్స్ ఆగిపోయాయి.

రీసెంట్గా సిటాడిల్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసింది సమంత . సిటాడిల్ కి డబ్బింగ్ చెప్తున్న ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసింది. అలాగే రాజ్ అండ్ డీకే టీం తో లాప్టాప్ లో సిటాడిల్ ఎడిటింగ్ వర్షన్ చూస్తున్న పలు ఫోటోలను కూడా షేర్ చేసింది. దాదాపు 22 నెల తర్వాత అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది . దీంతో సమంత ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మరో బాలీవుడ్ సినిమా కి కూడా కమిట్ అయ్యిందట సమంత..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news