Moviesమ‌హేష్‌బాబు ' గుంటూరు కారం ' సినిమాలో విజ‌య‌వాడ అమ్మాయి ఐటెం...

మ‌హేష్‌బాబు ‘ గుంటూరు కారం ‘ సినిమాలో విజ‌య‌వాడ అమ్మాయి ఐటెం సాంగ్‌..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. హారిక – హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎస్‌. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. ఖ‌లేజా త‌ర్వాత 13 సంవ‌త్స‌రాల లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ గుంటూరు కారం సినిమా కోసం జోడీ క‌డుతున్నారు. ఇక ఈ సినిమాలో ఓ ఐటెం నెంబ‌ర్ ఉంది. ఈ సాంగ్ కోసం పూజా హెగ్డే పేరు ప‌రిశీలించారు. పూజ ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై త‌ర్వాత త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే ఆమెతో ఐటెం సాంగ్ చేయించాల‌ని ద‌ర్శ‌కుడు అనుకున్నార‌ట‌. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్‌లో బెజ‌వాడ బ్యూటీ డింపుల్ హ‌య‌తీ తో ఈ స్పెష‌ల్ సాంగ్ చేయిస్తున్నార‌ట‌. మెగా హీరో వ‌రుణ్‌తేజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ గద్దలకొండ గణేష్ సినిమాలో డింపుల్ చేసిన స్పెషల్ నెంబర్ జర్ర జర్ర సాంగ్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఇప్పుడు మ‌హేష్ ప‌క్క‌న ఐటెం నెంబ‌ర్‌గా డింపుల్ ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంద‌నే త్రివిక్ర‌మ్ ఆమె పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news