Moviesఒకే టైటిల్‌తో మూడు సినిమాలు చేసిన ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ‌... సెన్షేష‌న‌ల్ రికార్డు...

ఒకే టైటిల్‌తో మూడు సినిమాలు చేసిన ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ‌… సెన్షేష‌న‌ల్ రికార్డు ఇది…!

నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో సినిమాలలో నటించారు. బాలయ్య, విజయశాంతి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే బాలయ్య తన కెరీర్‌లో అరుదైన రికార్డ్‌ సాధించారు. ఒకే టైటిల్‌తో రెండు సినిమాల్లో నటించారు. అందులో ఒక సినిమాలో ఆయన లక్కీ హీరోయిన్ విజయశాంతి ఆయనకు జోడిగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అదే టైటిల్‌తో కొన్నేళ్ల తర్వాత మళ్లీ సినిమా చేశారు. ఆ సినిమాకు కూడా మంచి పేరు వచ్చింది.

బాలకృష్ణ, విజయశాంతి తొలి కాంబినేషన్‌లో కథానాయకుడు సినిమా తెరకెక్కింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌లో హీరో బాలకృష్ణకు ఇదే మొదటి సినిమా. నిర్మాత డి.రామానాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు కే.మురళీమోహనరావు దర్శకత్వం వహించారు. అగ్రనటి శారద కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో నటించడం తొలిసారి కావ‌టం విశేషం. అయితే కథానాయకుడు టైటిల్ విషయంలో చరిత్ర పునరావృతం అయింది.

ఎన్టీఆర్, జయలలిత జంటగా నటించిన కథానాయకుడు సినిమా 1969 ఫిబ్రవరి 27న రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషించిన ఈ కథానాయకుడు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాల కథలు కూడా సమకాలీన రాజకీయాలు ప్రతిబింబిస్తూ సాగటం ఆసక్తి కలిగించే అంశం. ఇక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామానాయుడు నిర్మించిన 17వ సినిమా కథానాయకుడు కావడం విశేషం.

అతి సాధారణమైన కథ అయితే దర్శకుడు మురళీమోహనరావు అద్భుతమైన టేకింగ్ తో సినిమాను ప్రేక్షకులు రంజింపజేసేలా తెరకెక్కించారు. రాజకీయం, సెంటిమెంట్ సమకాలిన పరిస్థితులను సినిమాలో మేళవింప‌ చేశారు. పరుచూరి సోదరులు సంభాషణలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రముఖ నగరాల్లో 200 రోజులు పూర్తి చేసుకుంది. బాలయ్య కథానాయకుడు సినిమాలో నటించిన 35 సంవత్సరాల తర్వాత మరోసారి అదే టైటిల్‌తో ఆయన సినిమా చేశారు.

ఈసారి తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగంగా కథానాయకుడు, మహానాయకుడు సినిమాలలో ఆయన నటించారు. తొలిభాగానికి కథానాయకుడు టైటిల్ పెట్టారు. ఈ సినిమా కథపరంగా అద్భుతంగా ఉన్న సినిమా రిలీజ్ అయిన టైంలో.. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆశించిన విజయం సాధించలేదు. అయితే ఎన్టీఆర్ జీవితంలో సినీ ఘట్టాలను చాలా అద్భుతంగా ఈ సినిమాలో చూపించారు. బాలయ్యకు జోడిగా బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించారు. తండ్రి ఎన్టీఆర్, తనయుడు బాలయ్య ఇలా ఒకే టైటిల్‌తో వ‌చ్చిన మూడు సినిమాలలో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news