Moviesఫ్యాన్స్ కి దిమ్మ తిరిగిపోయే షాక్.. సోషల్ మీడియాని షేక్ చేసి...

ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగిపోయే షాక్.. సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్న రష్మిక న్యూ బాయ్ ఫ్రెండ్ ఫోటో.. ఏమున్నాడు రా బాబు..!

రష్మిక మందన్నా.. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఆ పేరు చెప్తేనే కుర్రాళ్ళ ఫీలింగ్స్ మారిపోతాయి. స్టార్ హీరోస్ మేకర్స్ అందరూ కూడా ఆమెతో సినిమాలు తీయాలి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఇప్పటికే నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె త్వరలోనే గ్లోబల్ బ్యూటీగా కూడా ట్యాగ్ చేయించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

రీసెంట్ గా వచ్చిన యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక త్వరలోనే పుష్ప2 సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది . రష్మిక ప్రెసెంట్ ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉంది. ఇది ఫ్రెండ్షిప్ ప్రేమ ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది . అయితే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ గా ఎవరు నటిస్తున్నారో ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమాలో రష్మికకు బాయ్ ఫ్రెండ్ గా కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు . ఈయన పలు తెలుగు కన్నడ సినిమాల్లో కూడా నటించాడు. కన్నడలో దియా సినిమాతో బాగా ఫేమస్ అయ్యాడు . దసరా సినిమాతో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు . సినిమా నుంచి దీక్షిత్ శెట్టిని పరిచయం చేస్తూ ఇందులో దీక్షిత్ గురించి రష్మిక వాయిస్ ఓవర్ చెబుతూ ..” నా బాయ్ ఫ్రెండ్ పేరు విక్కీ విక్రం.. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్.. బళ్ళారి అబ్బాయి విక్కినే మా కాలేజ్ టీం విరాట్ కోహ్లీ ..స్మైల్ చేస్తే చాలు అమ్మాయిలంతా ఫిదా ” అంటూ వాయిస్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది. ప్రెసెంట్ ఈ వీడియో నెట్టింట ట్రెండింగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news