Movies"గుంటూరు కారం" ఐటెం సాంగ్ లో ఆ కుర్ర బ్యూటీ.. త్రివిక్రమ్...

“గుంటూరు కారం” ఐటెం సాంగ్ లో ఆ కుర్ర బ్యూటీ.. త్రివిక్రమ్ అసలైన ఘాటైన సరుకు దించబోతున్నాడ్రోయ్..!!

ఇస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు కానీ మిగతా అప్డేట్స్ కానీ అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి.

అందుకే ఈసారి రిలీజ్ అయ్యే అప్డేట్ కచ్చితంగా సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేయాలి అని బాగా ఫిక్స్ అయిపోయాడు త్రివిక్రమ్ . ఆ కారణంగానే గుంటూరు కారం సినిమాలో ఐటెం సాంగ్ కోసం యంగ్ కుర్రబ్యూటీని రంగంలోకి దించాడు . ఆమె మరి ఎవరో కాదు డింపుల్ హయాతి . గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర అంటూ సాగే సాంగ్ లో అదరగొట్టేసింది . ఆ తర్వాత పలు సినిమాలో నటించిన క్రేజ్ రాలేకపోయింది .

ఇప్పుడు ఈ బ్యూటీ ఏకంగా మహేష్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఐటమ్ సాంగ్ అయినా సరే మహేష్ సినిమాలో నటించడం చాలా అదృష్టంగా భావించాలి . అంతేకాదు ఈ సినిమాలోని ఈ పాట గద్దల కొండ గణేష్ లోని జర్ర జర్ర సాంగ్ మించి పోయే రేంజ్ లో ఉంటుంది అంటూ ఈ సినిమాలో ఘాటు అయిన స్టెప్స్ కూడా ఈ పాటలో ఉండబోతున్నాయి అంటూ తెలుస్తుంది . చూడాలి మరి ఈ పాట అభిమానులను ఎలా ఆకట్టుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news