Moviesఆ ఇద్దరి హీరోలను డమ్మీలను చేసేసిన ప్రభాస్.. ఉప్పలపాటి రాజుల దెబ్బ...

ఆ ఇద్దరి హీరోలను డమ్మీలను చేసేసిన ప్రభాస్.. ఉప్పలపాటి రాజుల దెబ్బ మామూలుగా లేదుగా..!

బహుశా ఈ విషయాన్ని ప్రభాస్ కూడా ఊహించలేదేమో . అంతలా ఆయన ఫ్యాన్స్ సలార్ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు . జనరల్ గా స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద హంగామా ఓకే ..సందడి వాతావరణం నెలకొంటుంది . టపాసులు , పూలదండలు , పాలాభిషేకాలు, అరుపులు కేకలు, గొడవలు ఇవన్నీ చాలా కామన్ గా మనం చూస్తుంటాం వింటుంటాం . అయితే ప్రభాస్ సినిమా మాత్రం వేరే లెవల్ అని చెప్పాలి .

బాహుబలి తర్వాత ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ప్రభాస్ సలార్ సినిమాతో ఆ కోరిక తీర్చేశాడు. సలార్ సినిమాతో ప్లేట్ మిల్స్ కాదు ఫుల్ మీల్స్ తినిపించేసాడు ప్రభాస్. అయితే ఈ సినిమా సక్సెస్ను రెబెల్ ఫాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు సినిమాను మూడుసార్లు చూస్తూ జై రెబల్ హీరో అంటూ ప్రభాస్ నామస్మరణం చేస్తున్నారు . అయితే ఇలాంటి మూమెంట్లోని నిన్న మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పాన్ ఇండియా హీరోల పేర్లు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయాయి .

వీళ్లిద్దరూ లేకపోతే అసలు ఇండస్ట్రీని లేదేమో అన్న రేంజ్ లో మాటలు వినిపించాయి . అమ్మో ఆ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా అంతా కాదు . పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అని మా హీరో సినిమాలు హిట్ అవుతున్నాయి అని నోటికి వచ్చినట్లు తెగ వాగేసి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు . సీన్ కట్ చేస్తే సైలెంట్ గా వచ్చిన ప్రభాస్ దుమ్ము దులిపేశాడు.

సలార్ సినిమాతో రికార్డును బద్దలు కొట్టి బాక్సాఫీస్ వద్ద ఊచ కోత కోసేస్తున్నాడు . దీంతో రెబల్ ఫ్యాన్స్ ప్రభాస్ పేరుని ఓ రేంజ్ లో పొగిడేస్తూ హంగామా చేస్తున్నారు. దీంతో ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ డీలా పడిపోయారు. నెగిటివ్గా ట్రోల్ చేద్దామన్న సలార్ సినిమాలో ఏది నెగటివ్ గా లేదే అంటూ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది . దట్ ఇస్ రెబెల్ స్టార్ ఉప్పలపాటి రాజు స్టామినా అంటున్నారు అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news