Newsనానికి ఆ హీరోయిన్ క‌న్నా మృణాల్ ఠాకూర్ అన్ని రకాలుగా సెట్...

నానికి ఆ హీరోయిన్ క‌న్నా మృణాల్ ఠాకూర్ అన్ని రకాలుగా సెట్ అయిందా..?


వాణి కపూర్..తెలుగులో ఆహా కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన బాండ్ భాజా బరాత్ కి రీమేక్. వాణి కపూర్ తెలుగులో నాని సరసన నటించే ఛాన్స్ రావడంతో ఇక్కడ బాగానే సెటిలవుతుందనుకున్నారు. కానీ, ఒకే ఒక్క సినిమాతో వాణి మళ్ళీ తెలుగులో కనిపించలేదు. చెప్పాలంటే ఇంత హాట్ బ్యూటీకి సరైన సక్సెస్ వస్తే తెలుగులో ఏ నిర్మాత వదలడు.

హీరోలు మాకు వాణి కపూర్ కావాలని అడిగి మరీ తమ సినిమాలలో తీసుకునేవారు. ఇక త్రివిక్రం లాంటి దర్శకులైతే ఒకటి కాదు కనీసం మూడు సినిమాలలోనైనా ఛాన్స్ ఇచ్చేవారు. బాలీవుడ్ లో శుద్ధ్ దేశీ రొమాన్స్ అనే సినిమాతో వాణి సంచలనం సృష్ఠించింది. ఈ ఒక్క సినిమా ఆమెకి చాలారోజులు మైలేజ్ తెచ్చిపెట్టింది. ఈ మూవీ పర్ఫార్మెన్స్ పరంగా వాణికి చాలామంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత బేఫిక్రే బాలీవుడ్ లో వాణికి మరో సాలీడ్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాలో వాణి అందాల ఆరబోత సెమీ న్యూడ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, హీరోతో లిప్ లాక్స్ దుమారం రేపాయి. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతగా ఇక్కడ సంచలనం సృష్ఠించిందో బాలీవుడ్ లో అప్పట్లో వచ్చిన బేఫిక్రే అంత సంచలనం సృష్ఠించింది. అంత పాపులర్ ఉన్నా ఈ బ్యూటీ నానికి మాత్రం అసలు సెట్ అవలేదు.

ఇప్పుడు కాస్త అటు ఇటుగా అదే పోలికలతో ఉన్న మృణాల్ ఠాకూర్ నానికి బాగా సూటయిందని చెప్పుకుంటున్నారు. హాయ్ నాన్న సినిమాలో నానితో మృణాల్ బాగానే రొమాన్స్ చేసింది. లిప్ కిస్ కూడా పెట్టింది. తండ్రీ కూతుళ్ళ కథ అయినా నానితో మృణాల్ కి మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా నాని సరసన నటించిన హీరోయిన్స్ కి మంచి పేరొస్తుంది. మరి మృణాల్ కి ఎలాంటి పేరొస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news