News"ఎక్స్ట్రార్డినరి మ్యాన్" మూవీ రివ్యూ: మన నితిన్ గాడు హిట్ కొట్టాడోచ్.....

“ఎక్స్ట్రార్డినరి మ్యాన్” మూవీ రివ్యూ: మన నితిన్ గాడు హిట్ కొట్టాడోచ్.. సినిమా సూపర్ డూపర్ హిట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న నితిన్ తాజాగా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకునింది . కధ కంటెంట్ విషయం పక్కనపెడితే సినిమాలో 80% కామెడీను చూపించి జనాలను కడుపుబ్బ నవ్వేల చేశాడు డైరెక్టర్ .

మరీ ముఖ్యంగా ఒక హిట్ కోసం అల్లాడిపోతున్న నితిన్ కు ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది . థియేటర్ నుంచి బయటికి వచ్చిన జనాలు నవ్వుకోవడం తప్పిస్తే ఎక్కడ నెగటివ్ కామెంట్ చేయడం లేదు. .పాటలు సీన్స్ అన్నీ కూడా అంతే కామెడీగా ఉన్నాయి అని ఎక్కడ వల్గారిటికి తావులేదు అని .. డేంజర్ పిల్ల సాంగ్ వచ్చేటప్పుడు థియేటర్స్ లో జనాలు రేంజ్ లో ఊగిపోతున్నారట .

అంతేకాదు డైలాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అంటున్నారు. మరి ముఖ్యంగా నితిన్ లోని కామెడీ టైమింగ్ ను వక్కంతం వంశి బాగా వాడుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల పాత్ర చిన్నది అయినప్పటికీ ఆమె అందం పరంగా ఆకట్టుకునింది అని సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ నితిన్ అని .. సినిమా సూపర్ డూపర్ హిట్ అని కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news