Newsబాల‌య్య 109లో స‌ర్‌ఫ్రైజింగ్ బ్యూటీ... పేరు తెలిస్తే వామ్మో అనాల్సిందే...!

బాల‌య్య 109లో స‌ర్‌ఫ్రైజింగ్ బ్యూటీ… పేరు తెలిస్తే వామ్మో అనాల్సిందే…!

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య లాంటి మాస్ హిట్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు బాబి ఇప్పుడు బాలయ్యతో మరో మాస్ క‌థ‌తో సినిమా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శ‌రవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వైజాగ్ అమ్మాయి.. తెలుగు బ్యూటీ చాందిని చౌదరి ఈ సినిమాలో నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర లేదా కీలకపాత్ర అన్నది క్లారిటీ లేదు.

మొత్తం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు అమ్మాయి చాందిని చౌదరికి బాల‌య్య సినిమాలో ఛాన్స్ అంటే ఆమె లక్కీ అనుకోవాలి. చాందిని చౌదరి ఇప్పటికే ప‌లు సినిమాలలో నటించి మెప్పించింది. ఆమె నటించిన కలర్ ఫోటో సూపర్ హిట్ అవడంతో చాందిని చౌదరి పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా ఎవరు ? హీరోయిన్గా నటించబోతున్నారు అన్నదానిపై దర్శకుడు బాబి త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ మరియు దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. సాయి సౌజన్య ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా టైటిల్ ప్రకటించడంతోపాటు టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news