Newsఅనంత‌పురం బ్యాక్‌డ్రాఫ్‌లో బాల‌య్య యాక్ష‌న్ మూవీ... క‌థ మొత్తం ఇదే...!

అనంత‌పురం బ్యాక్‌డ్రాఫ్‌లో బాల‌య్య యాక్ష‌న్ మూవీ… క‌థ మొత్తం ఇదే…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ.. దర్శకుడు బాబి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన బాలయ్య దసరాకు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి.. మరో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య కెరీర్‌లో తిరుగులేని ఫామ్ లో ఉన్నారు.

ఇటు బుల్లితెరపై అన్‌స్టాపుల్ టాక్ షోలో బాలయ్య హోస్ట్ చేసిన అన్ని ఎపిసోడ్లు బాగా పేలుతున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య – బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన బాబి.. ఇప్పుడు బాలయ్యతో ఎమోషనల్ యాక్షన్ ఫిలిం తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ అప్డేట్ బయటకు వచ్చింది.

అనంతపురంలో ఈ సినిమా తాజా షెడ్యూల్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో అనంతపురం ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో ఉంటుందని.. ఈనెల మూడోవారం నుంచి అనంతపురంలో బాలయ్యపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లు షూట్ చేస్తారని తెలుస్తుంది. సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ అంతా అనంతపురంలో ఉంటుందని సమాచారం. సినిమాలో బాలయ్య గెటప్, సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందట.

ఈ సినిమా బాలయ్య టైపు ఫ‌క్తు యాక్షన్ డ్రామా కాదు. ఇది ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో.. సాగే ఎమోషనల్ డ్రామా. అలాగే సెకండ్ హాఫ్ లో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news