Newsఆ లెటర్ పేరు ఉన్న హీరోయిన్లకు స్టార్ స్టేటస్ దక్కదా.. ముగ్గురు...

ఆ లెటర్ పేరు ఉన్న హీరోయిన్లకు స్టార్ స్టేటస్ దక్కదా.. ముగ్గురు హీరోయిన్లు మునిగిపోయారుగా..!

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లను పాటించే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువనే సంగతి తెలిసిందే. కథ, కథనం, హీరో యాక్టింగ్, డైరెక్షన్ స్కిల్స్ వల్లే సినిమా సక్సెస్ సాధించినా కొంతమంది మాత్రం సెంటిమెంట్ వల్లే సినిమా సక్సెస్ సాధించిందని ఫీలవుతారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక లెటర్ తో పేర్లు మొదలైన హీరోయిన్లకు లక్ కలిసిరావడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రకుల్, రాశీఖన్నా, రెజీనా అద్భుతంగా నటిస్తారని పేరు సంపాదించుకున్నా ఈ హీరోయిన్లు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే సంగతి తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న రకుల్ నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు సినిమాల విజయాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే స్పైడర్, మన్మథుడు2 సినిమాలలోని పాత్రలు ఆమె కెరీర్ కు మైనస్ అయ్యాయి.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవడంతో రకుల్ ప్రీత్ సింగ్ కు ఛాన్స్ ఇవ్వడానికి కూడా దర్శకనిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. ఇతర ఇండస్ట్రీలలో అడపాదడపా ఆఫర్లను అందుకుంటున్న ఈ బ్యూటీ తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. మరో హీరోయిన్ రాశీఖన్నా జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, రామ్ లాంటి క్రేజ్ ఉన్న హీరోలకు జోడీగా నటించినా కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

పక్కా కమర్షియల్ ఫ్లాప్ తర్వాత ఈ హీరోయిన్ చేతిలో ఎక్కువగా ఆఫర్లు లేవు. యంగ్ హీరోలకు జోడీగా ఎక్కువ సినిమాలలో నటించిన రెజీనా సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సైతం నటించారు. అయితే ఈ హీరోయిన్ కు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో మూవీ ఆఫర్లు అయితే రాకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ ముగ్గురు హీరోయిన్ల పేర్లలో మొదటి అక్షరం ర కాగా ఈ అక్షరంతో పేర్లు మొదలైన హీరోయిన్లకు టాలీవుడ్ ఇండస్ట్రీ కలిసిరావడం లేదని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news