Newsటాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్‌... ఆ హీరోయిన్‌కు చేదు అనుభ‌వం..!

టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్‌… ఆ హీరోయిన్‌కు చేదు అనుభ‌వం..!

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలోనైనా సరే అవకాశాలు వచ్చాయంటే చాలా మంది సెలబ్రిటీలు నటించడానికి మక్కువ చూపుతున్నారు. ప్రముఖ నటుల సరసన నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ మాహిమ నంబియార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తాజాగా ఇమే ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల పైన స్పందిస్తూ సినీ పరిశ్రమలో కథానాయకులు గురించి పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అంతేకాకుండా తన జీవితంలో కూడా ఎదుర్కొన్న సమస్యలను గురించి తెలియజేయడం జరిగింది.
మహిమ నంబియార్ మాట్లాడుతూ.. గతంలో తెలుగులో ఒక ప్రముఖ హీరో సరసన నటించిన అవకాశం వచ్చిందని ఆ సినిమా లో నాలుగు రోజులపాటు నటించాను.. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని షూటింగ్ చేద్దామని చిత్ర బృందాలు తెలియజేశారట.

కానీ కొద్ది రోజుల తర్వాత ఆ సినిమా మేనేజర్ తనకు ఫోన్ చేసి ఇందులో ఒక పెద్ద హీరోయిన్ నటించడానికి ఒప్పుకున్నారని అందుకే తనను తొలగించినట్లుగా తెలియజేశామని తెలిపారుట.ఇలా ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నానని తెలిపింది. హీరోయిన్గా ఈమె తన 12వ తరగతి చదువుతున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందట.. మొదట సాట్టే చిత్రం ద్వారా కోలీవుడ్ తెరకు పరిచయమైన మహిమ నంబియార్.. ఈమె కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.

ముఖ్యంగా చంద్రముఖి-2, రత్తం తదితర చిత్రాలు ఒకేరోజు విడుదల అయ్యాయి ఇందులో ఈమే విలనిజాన్ని చూపించి అందరిని ఆకట్టుకుంది. అయితే నంబియార్ వదులుకున్నటువంటి ఆ సినిమా గురించి గానీ నటీనటుల గురించి గానీ పెద్దగా తెలియజేయలేదు ఈ ముద్దుగుమ్మ. అప్పటినుంచి ఎక్కువగా కోలీవుడ్ వైపే పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాహిమ నంబియార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news