News' స‌లార్ ' సాంగ్స్ లెక్క బ‌య‌ట‌కు వ‌చ్చేసింది... ప్ర‌శాంత్ నీల్...

‘ స‌లార్ ‘ సాంగ్స్ లెక్క బ‌య‌ట‌కు వ‌చ్చేసింది… ప్ర‌శాంత్ నీల్ ట్విస్ట్ మామూలుగా లేదే..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా.. కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల‌తో నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండ్ సెట్‌ చేసిన మాస్ దర్శకుడు ప్రశాంత నీల్‌ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ త్రిల్లర్ స‌లార్. కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో ప్రశాంత్ నీల్ నేషనల్ వైడ్‌గా ఎలా పాపులర్ అయ్యాడో ? చూస్తూనే ఉన్నాం. ఇటు బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారి మోగిపోతుంది.

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సలార్‌ సినిమాపై అంచనాలు కనివినీ ఎరగని రేంజ్ లో ఉన్నాయి.
సలార్ రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న రిలీజ్ కావలసిన సలార్ సినిమా డిసెంబర్ 22 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ డుంకి సినిమాతో పోటీపడుతూ సలార్ థియేటర్లలోకి వస్తోంది.

ఇక సలార్ మ్యూజిక్ ఆల్బమ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు బయటకు వచ్చేసింది. మొదటి నుంచి కూడా ఈ సినిమాలో కేజీఎఫ్ తరహాలో పాటలు ఏమీ ఉండవని అన్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సలార్‌లో కేవలం రెండు అంటే రెండు పాటలు మాత్రమే ఉంటాయట. వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్ కాగా రెండోది హీరో ఎలివేషన్ సంబంధించిన పాట అని తెలుస్తోంది.

దీంతో సలార్‌లో సాంగ్స్ తక్కువ, యాక్షన్ ఎక్కువ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. హీరోయిన్ శృతిహాసన్ – ప్రభాస్ మధ్యలో కూడా ఒక రొమాంటిక్ సాంగ్.. ఒక్క డ్యూయెట్ సాంగ్.. కూడా లేదట. ప్రశాంత్ నీల్ క‌థ‌ చెప్పే విషయంలో తగ్గకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news