Newsబాల‌య్య - బాబి సినిమాలో హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌... అదిరిపోయే న్యూస్‌..!

బాల‌య్య – బాబి సినిమాలో హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌… అదిరిపోయే న్యూస్‌..!

నందమూరి బాలకృష్ణ తాజాగా దసరా కానుకగా భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకా థియేటర్లలో రన్ అవుతుంది. వెంటనే బాలయ్య కొత్త సినిమా కూడా పట్టాలు ఎక్కేసింది. బాబీ దర్శకత్వంలో బాలయ్య 109వ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కొంత హైదరాబాద్ బ్యాగ్రౌండ్ ఉంటుందని తెలుస్తుంది. సినిమా షూటింగ్ కూడా చాలావరకు రామోజీ ఫిలిం సిటీ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల.. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్లలో జరుపుకొనుంద‌ని సమాచారం. బాలయ్య ఎంట్రీ సీన్స్ కోసం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ సెట్ వేస్తున్నారు.

ఈ సెట్‌లో బాలయ్య, విల‌న్‌ మధ్య యాక్షన్ సీన్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమా బాలయ్య టైపు ఫ‌క్తు యాక్షన్ డ్రామా కాదు అని.. ఇది ఒక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎమోషనల్ డ్రామాని ఇప్పటికే తెలుస్తోంది. అలాగే సెకండ్ హాఫ్ లో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

హైదరాబాద్ నేపథ్యంలో వచ్చే అంశాలు అన్ని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news