News' స‌లార్ ' ఆంధ్రా డిస్ట్రిబ్యూష‌న్‌.. ఏ ఏరియాకు ఎవ‌రంటే... బ‌డా...

‘ స‌లార్ ‘ ఆంధ్రా డిస్ట్రిబ్యూష‌న్‌.. ఏ ఏరియాకు ఎవ‌రంటే… బ‌డా నిర్మాత‌లు కూడా…!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ సినిమా స‌లార్ 1. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై రెండు పార్టులుగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాకు రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్ అవుతున్న‌ట్టు తెలు్స్తోంది.

సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కావాల్సిన స‌లార్ సినిమా కాస్తా వాయిదా ప‌డి డిసెంబ‌ర్ 22న రిలీజ్ అవుతోంది. గ‌తంలో ప్ర‌శాత్ నీల్‌తో కేజీయ‌ఫ్ 1,2 సినిమాలు నిర్మిస్తోన్న విజ‌య్ కిరంగాదూర్ ఈ సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో వీరంగం ఆడేస్తోంది. శ్రియా రెడ్డి, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ నుండి థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ చేస్తోన్న విషయం తెలిసిందే.

ఇక తమ మూవీ యొక్క ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ డీటెయిల్స్ మేక‌ర్స్ రిలీజ్ చేశారు. పెద్ద సంస్థ‌లు భారీ రేట్లు కోట్ చేసి మ‌రీ స‌లార్ ఏరియా వైజ్ రైట్స్ సొంతం చేసుకున్నాయి. అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూష‌న్ వెస్ట్ రైట్స్ సొంతం చేసుకుంది. ఏరియాల వారీగా స‌లార్ డిస్ట్రిబ్యూట‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరాంధ్ర – శ్రీ సిరి సాయి సినిమాస్
ఈస్ట్ – లక్ష్మీ నరసింహ శ్రీ మణికంఠ ఫిలిమ్స్
వెస్ట్ – గీతా ఫిల్మ్స్‌
కృష్ణా – గుంటూరు – కెఎస్ఎన్ టెలి ఫిలిమ్స్
నెల్లూరు – శ్రీ వెంగబాంబ సినిమాస్
సీడెడ్ – శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news