Newsఆ క్రేజీ హీరోకు జోడీగా రాజ‌శేఖ‌ర్ కూతురు... వామ్మో ఇదెక్క‌డి గొడ‌వ‌రా...

ఆ క్రేజీ హీరోకు జోడీగా రాజ‌శేఖ‌ర్ కూతురు… వామ్మో ఇదెక్క‌డి గొడ‌వ‌రా బాబు…!

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లు ఊహకే అందకుండా చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. అసలు ఏమాత్రం జోడి కట్టే ఛాన్స్ లేదనుకున్న హీరో, హీరోయిన్లు జంటగా నటిస్తూ ఉంటారు. కొన్ని ఖచ్చితంగా జంట కడితే బాగుంటుంది.. అనుకున్న హీరో, హీరోయిన్లు ఎప్పటికీ జంటగా సినిమాలు చేయరు. పవన్ కళ్యాణ్, అనుష్క పవన్ కళ్యాణ్, నయనతార కాంబినేషన్లో సినిమాలు రాలేదు. అలాగే ఎన్టీఆర్ – అనుష్క కాంబినేషన్లో కూడా సినిమాలు రాలేదు. టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి సీనియర్ నటుడు అయిన జీవిత రాజశేఖర్ దంపతుల కుటుంబానికి గత కొన్నేళ్లుగా వైరం ఉంది.

రాజకీయాలతో మొదలైన ఈ వైరం ఇటు సినిమాలు.. చివరకు వ్యక్తిగత జీవితంలోకి కూడా వచ్చేసింది. అలాంటిది ఇప్పుడు మెగా ఫ్యామిలీకి చెందిన ఓ యంగ్‌ హీరోకు జోడిగా జీవిత – రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ కలిసి ఓ సినిమాలో నటించబోతుందా అంటే.. ఎస్ అవును అన్న చర్చలే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజంగా మెగా హీరో జీవిత – రాజశేఖర్ కుమార్తె జంటగా నటిస్తే టాలీవుడ్ లోనే ట్రెండ్‌సెట్‌ అవుతుంది అనటంలో సందేహం లేదు.

ఈ రెండు కుటుంబాల మధ్య కాస్త గ్యాప్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది శివాన్ని ఇప్పుడు గీత ఆర్ట్స్ 2 లో కోటబొమ్మాలి పీఎస్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మెగా ఫ్యామిలీతో విభేదాలపై స్పందిస్తూ ఏదో ఒక సమయంలో అపోహలు, అపార్థాలు తలెత్తి ఉండవచ్చు. సినిమాగా చూస్తే మేమంతా ఒక కుటుంబమే అని చెప్పటం విశేషం.

ఇక మెగా హీరో సాయిధర‌మ్‌తేజ్ – శివాని కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఓ యంగ్ క్రేజీ డైరెక్టర్ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్లో ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news