Newsచెన్నై వెళితే షకీలా ఇంటికెళ్ళే టాలీవుడ్ నటుడెవరో తెలుసా..?

చెన్నై వెళితే షకీలా ఇంటికెళ్ళే టాలీవుడ్ నటుడెవరో తెలుసా..?

షకీలా..మలయాళం ఇండస్ట్రీలో ఒకప్పుడు పెద్ద సునామీ. తన సినిమా రిలీజ్ అవుతుందంటే అప్పటికే స్టార్స్ గా మలయాళం సినిమాను ఏలుతున్న మోహన్ లాల్, మమ్ముటి కూడా తమ సినిమాలను రిలీజ్ ఆపేసిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. షకీలా సినిమా గంటపైనే. కానీ, ఆ గంట సినిమా కోసం మలయాళం ఇండస్ట్రీ కుదేలైన సందర్భాలున్నాయి. అక్కడ ఇండస్ట్రీవారు కొంతకాలం షకీలాని తట్టుకోవాలంటే తలలు పట్టుకున్నారు.

శృంగార తారగా సన్నిలియోన్ ఎంత ఫేమసో సౌత్ లో షకీలా అంత ఫేమస్. తను ఇంట్లో ఇబ్బందుల వల్ల తన తల్లే నన్ను ఈ రొంపిలోకి దింపిందని..ఇలాంటి సినిమాలు చేయను అంటే కొట్టేదని ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చింది. మసాల సినిమాలు చేస్తున్న కారణంగా రాజకీయనాయకులు, బడా వ్యాపారస్తులు తనకి కాల్ చేసి రమ్మనేవారని చెప్పింది. ఇక లవ్ చేస్తానని చెప్పు వాడుకున్నన్ని రోజులు వాడుకొని మొహం చాటేసిన చాలామంది ఉన్నారట.

అందుకే, షకీలా ప్రేమ పవిత్రమైందని ..కానీ, దాన్ని అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులు చేసి మోసం చేస్తున్నారని వాపోయింది. అయితే, తెలుగులో తనకి అత్యంత సన్నిహితంగా ఉండేది కమెడియన్ వేణుమాధవ్ అని చెప్పింది. ఇక్కడ తనని చాలా గౌరవిస్తారని..నాకు తెలుగులో మంచి రోల్స్ ఇచ్చిన తేజ అంటే ఎంతో గౌరవం అని ..మలయాళం మసాలా సినిమాలు మానేసి మంచి రోల్స్ కావాలని తెలుగు ఇండస్ట్రీ తలుపు తడితే చాలామంది అవతలికి పొమ్మన్నారట.

నువ్వు ఉంటే మా సినిమా కలర్ మారిపోతుందని ఎగతాళి చేశారట. కానీ, ఇక్కడ తేజ నాకు అవకాశం ఇచ్చి కొత్త జీవితాన్ని ఇచ్చారని చెప్పింది. అలాగే, చెన్నై ఎప్పుడొచ్చినా వేణు మాధవ్ నా ఇంటికి వచ్చి వెళతారని..మాది మంచి స్నేహబంధం అని చెప్పింది. ఆయనంటే కూడా చాలా గౌరవం అని షకీలా తెలిపింది. మరి షకీలాకి వేణు మాధవ్ కి ఎలా పరిచయం ఏర్పడి అది స్నేహబంధంగా ఎలా బలపడిందో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news