News"ఆచార్య" కంటే ముందే చరణ్ - చిరు కాంబినేషన్లో రావాల్సిన సినిమా...

“ఆచార్య” కంటే ముందే చరణ్ – చిరు కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఏంటో తెలుసా… సెట్ అయ్యుంటే బాక్స్ ఆఫీస్ బద్ధలే..!

మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకున్న కాంబినేషన్ ఇది .మెగాస్టార్ చిరంజీవి ఆయన కొడుకు రామ్ చరణ్ తెరపై కలిసిన నటిస్తే చూడాలి అంటూ ఎప్పటినుంచో అడుగుతూ వచ్చారు . అలాంటి సినిమాలు కూడా కొన్ని వచ్చాయి అయితే ఫుల్ లెంత్ లో వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఆచార్య . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది. అంతేకాదు అసలు మెగా ఫ్యామిలీలో రిలీజ్ అయిన సినిమాలలో పరమ చెత్త కలెక్షన్స్ దక్కించుకునింది .

ఈ సినిమా కారణంగా మెగా ఫ్యామిలీ హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురైంది . అయితే నిజానికి చరణ్ చిరు కాంబినేషన్లో ఈ సినిమా కంటే ముందే ఓ సినిమా రావాల్సి ఉంది. ఆ సినిమా మరేదో కాదు మగధీర . రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి కోసం ఒ కీలక పాత్రను రాసుకున్నారట రాజమౌళి . అయితే అప్పటికే చిరంజీవి సినిమాలు చేయను అంటూ ప్రకటించడంతో ఈ పాత్ర పై ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ పెట్టుకున్నారట .

ఈ సినిమాకి ఒప్పుకున్నప్పుడు “చరణ్ ఇందులో ఒక పాత్ర ఉంది . ఆ పాత్ర కేవలం నాన్నగారే నటించగలరు ఆయన ఒప్పుకుంటే పెడదాం.. ఒప్పుకోకపోతే తీసేద్దాం అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారట “. అయితే చిరంజీవి మాత్రం ఫుల్ లెంత్ రోల్ నటించడానికి ఇష్టపడలేదట . ఈ క్రమంలోని జస్ట్ ఒక సాంగ్ లో అలా కనిపించి ఇలా మాయమైపోయే విధంగా క్యారెక్టర్ నీ మొత్తం తగ్గించేశారు. ఒకవేళ ఆరోజు చిరంజీవి ఆ సినిమాలో నటించి ఉంటే మాత్రం సినీ చరిత్ర తిరిగి రాసి ఉండేవారు . బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేసి ఉండేది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news