Newsచిరంజీవి వ‌ల్లే ఎల్బీ శ్రీరాం కెరీర్ మ‌టాష్ అయ్యింద‌ని తెలుసా...!

చిరంజీవి వ‌ల్లే ఎల్బీ శ్రీరాం కెరీర్ మ‌టాష్ అయ్యింద‌ని తెలుసా…!

చిరంజీవి వల్ల రాఘవ లారెన్స్ సౌత్ లో పెద్ద కొరియోగ్రాఫర్ పాపులర్ అయ్యారు. ఇప్పుడు దర్శకుడు కూడా. అంతేకాదు సామాజిక సేవలో అందరికంటే గొప్పగా చేస్తున్నాడు. చిరంజీవి వల్ల ఒకరు పైకొస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. అయితే, రచయితగా మంచి కెరీర్ ఉండాల్సిన ఎల్బీ శ్రీరాం లాంటి వాళ్ళు మాత్రం అవకాశాలు లేకుండా కెరీర్ దెబ్బతినడానికి ఇదే మెగాస్టార్ కారణం అయ్యారు.

అదెలాగంటే, చిరంజీవికి వరుసగా ఫ్లాప్స్ వచ్చిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఠామేస్త్రి, అల్లుడా మజాకా, ముగ్గురు మొనగాళ్ళు, ఎస్పీ పరశురాం, లాంటి వరుస డిజాస్టర్స్ తర్వాత హిట్లర్ సినిమాతో కం బ్యాక్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించగా కోటి సంగీతం అందించారు. రంభ చిరుకి జంటగా నటించింది. ఈ సినిమాతోనే రాఘవ లారెన్స్ డాన్స్ కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా వల్ల అందరికీ ప్లస్ అయింది. ముఖ్యంగా చిరంజీవి కెరీర్ బాగా ఊపందుకుంది. కానీ, ఈ సినిమాలో డైలాగ్స్ రాసిన నటుడు ఎల్బీ శ్రీరాం కి మాత్రం పెద్ద మైనస్ అయింది. ఒకరకంగా ఆయనకి రచయిగతా అవకాశాలు లేకుండా పోయాయి. ఈ విషయం స్వయంగా అల్బీ శ్రీరాం ఇంటర్వ్యూలో చెప్పారు. మెగాస్టార్ సినిమాకి డైలాగ్స్ రాయడం గొప్ప అదృష్టంగా భావించిన నాకు ఆ సినిమానే పెద్ద శామప్ అయిందని చెప్పారు.

చిరంజీవి సినిమాకి డైలాగ్స్ రాయడం అది పెద్ద హిట్ అవడం వల్ల చిన్న సినిమాలు తీసే వాళ్ళు ఎల్బీ శ్రీరాం కి రచయితగా అవకాశాలు ఇవ్వలేదట. పెద్ద రైటర్ అయ్యారు కాబట్టి రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తారనే ఉద్దేశ్యంతో నాకు అవకాశాలు ఇవ్వలేదని ఆ రకంగా నాకు హిట్లర్ మైనస్ అయిందని చెప్పారు.

  1. రాజ్-కోటి విడిపోవడానికి కారణం అదేనా..?

సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి పనిచేశారు. విడిపోక ముందు ఇద్దరు ఒక సినిమా ఒప్పుకుంటే ట్యూన్స్ దగ్గరనుంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వరకూ కలిసే వర్క్ చేసేవారు. మ్యూజికల్ హిట్ గ్యారెంటీ అని దర్శకనిర్మాతలే కాదు, హీరోలు కూడా గట్టిగా నమ్మేవారు. ఇద్దరు మంచి ఉన్నత కుటుంబం నుంచీ వచ్చారు. వారి పేరులోని పదాలనే కలిసి పెట్టుకున్నారు.

రాజ్ – కోటి కలిసి సంగీతం అందించిన మొదటి సినిమా ప్రళయ గర్జన. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి మ్యూజిక్ అందించారు. చిరంజీవి హీరోగా నటించిన యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి అప్పట్లో మంచి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అలాగే, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి సినిమాలకు ఈ సంగీత దర్శక ద్వయం సంగీతాన్ని సమకూర్చారు.

అయితే, ఇద్దరి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల రాజ్-కోటి విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాజ్ సంగీతం అందించిన సినిమాలు చాలా తక్కువ. రాజ్ ఒక్కడే సంగీతం అందించిన సినిమా “సిసింద్రీ”. మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశాలు తగ్గాక కొన్ని టీవి షో లకు జడ్‌గా వ్యవహరించారు. ఇక కోటి మాత్రం ఇప్పటికీ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.

హలో బ్రదర్ తర్వాత మళ్ళీ కోటి ఫాంలోకి వచ్చిన సినిమా నువ్వే కావాలి. ఈ సినిమాలోని సాంగ్స్ బ్లాస్ట్ అయ్యాయి. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఇక లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అరుంధతి సినిమా కోటి కెరీర్‌లో గొప్పగా చెప్పుకోవాలి. ప్రస్తుతం కోటి కూడా సినిమాలకంటే టీవీ షోలలో ఎక్కువగా కనిపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news