Newsత్రిష తీసుకున్న ఈ ఫొటోలో మ్యాజిక్ చూశారా...!

త్రిష తీసుకున్న ఈ ఫొటోలో మ్యాజిక్ చూశారా…!

చెన్నై చిన్నది త్రిష ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతుంది. ఆమె ఎప్పుడు 2001 లో వచ్చిన నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆమె సినిమాలోకి వచ్చి 22 సంవత్సరాలు అవుతోంది. అయినా కూడా ఆమె జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియ‌న్ సెల్వ‌న్‌ సినిమాలో అలరించింది. అంతేకాకుండా ఆకట్టుకునే అందంతో కళ్ళు పెద్దవి చేసుకునే మరీ ఆమెనే చూడాలనిపించే అంత అందంగా కనిపించింది.

మామూలుగా చూస్తే త్రిష వయసు 40 దాటుతున్న అందంలో మాత్రం ఆమె 20 లలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇతర సీనియర్ ముద్దుగుమ్మలతో పోల్చితే చాలా తక్కువ వయసు ఉన్న హీరోయిన్గా త్రిష కనిపిస్తోంది. నయనతార, అనుష్కతో పోల్చి చూసినప్పుడు త్రిష చాలా సన్నగా.. ఆమె వయసు జస్ట్ 25 అన్నట్టుగానే కనిపిస్తుంది. తాజాగా త్రిష షేర్ చేసిన ఈ సెల్ఫీ చూస్తే ఆమె వ‌య‌స్సు విషయంలో ఉన్న చిన్న చిన్న అనుమానాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్న అందంగా కనిపిస్తోంది.

వైట్ టీ షర్ట్.. టైట్ ప్యాంట్‌ వేసుకుని తీసుకుంటున్న ఈ సెల్ఫీ చూస్తుంటే కాలేజ్ అమ్మాయిలా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతుంది. త్రిష అభిమానులు మాత్రమే కాదు.. సినీ జనాలు అందరూ లైకులు, కామెంట్లతో అభినందిస్తున్నారు. ఇక ఇటీవల చిరంజీవికి జోడీగా త్రిష పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు .ఆమె విజ‌య్‌కు జోడీగా నటించిన లియో సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news